న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'సౌదీలో పాక్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటా'

Boxer Amir Khan out to avenge Pakistans loss in World Cup against India in fight versus Neeraj Goyat

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ ఓటమికి తాను ప్రతీకారం తీర్చుకుంటానని పాక్ సంతతికి చెందిన బ్రిటిష్‌ బాక్సర్‌ ఆమిర్‌ ఖాన్‌ అన్నాడు. ఆదివారం మాంచెస్టర్ వేదికగా భారత‌్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో జులై 12న సౌదీ అరేబియాలో జరగబోయే బాక్సింగ్‌ మ్యాచ్‌లో భారత బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ను ఓడిస్తానని ఆమిర్‌ ఖాన్‌ ట్వీట్ చేశాడు.

మరొక ట్వీట్‌లో పాకిస్థాన్ జట్టుకు తాను ఫిట్‌నెస్ పాఠాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. "ఫిట్‌నెస్‌ ఎలా మెరుగుపరుచుకోవాలో పాక్‌ క్రికెట్‌ జట్టుకు నేను సూచనలు చేస్తా. ఆహారం, డైట్‌ విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో చెబుతా. పాక్‌ జట్టులో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వారు బలంగా మారి పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి" అని ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ ట్వీట్‌కు నీరజ్‌ గోయత్‌ సైతం దీటుగా బదులిచ్చాడు. "అలాగే కలలోనే ఉండు ఆమిర్‌.. నువ్వు నా విజయాన్ని, భారత గెలుపుని వీక్షిస్తావు" అంటూ నవ్వుతున్న ఎమోజీలు పెట్టాడు.

కాగా, ఆమిర్‌ పుట్టి పెరిగింది మాంచెస్టర్‌లోనే అయినా అతడు పాక్ సంతతికి చెందిన వ్యక్తి. దీంతో ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అతడు పాకిస్థాన్ జట్టుకు మద్దతు తెలిపాడు.

Story first published: Tuesday, June 18, 2019, 16:48 [IST]
Other articles published on Jun 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X