For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీనివాసన్‌కు ఊరట: సెహ్వాగ్, గంభీర్ కథ ముగిసిందా?

By Srinivas

ముంబై: ఎన్ శ్రీనివాసన్‌కు బాంబే హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. అతనికి వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో అతనికి ఊరట లభించినట్లయింది. కాగా, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ బాంబే హైకోర్టులో శ్రీనివాసన్ పైన పిల్ దాఖలు చేసింది.

సెప్టెంబర్ నెలలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ పబ్లిక్ ఇంటరెస్టే లిటిగేషన్ (పిల్) దాఖలు చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నియమ, నిబంధనల రివ్యూ విషయమై ఈ పిల్ దాఖలైంది.

ఆ ముగ్గురి కథ ముగిసిందా?

Bombay High Court Dismisses Conflict of Interest Petition Against Srinivasan

భారత జట్టుకు సేవలు అందించిన వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ కథ ముగిసినట్లేనా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఫామ్ లేమి, గాయాలు ఈ ముగ్గురిని జట్టుకు దూరం చేశాయి. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమిలు ప్రతిభ చూపుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి రావాలనుకుంటే అత్యధ్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. కానీ, దేశవాళీ క్రికెట్లో రాణించడం ఇప్పుడంత సులువుగా కనిపించడం లేదు. యువ క్రికెటర్లతో పోటీ పడి రాణించలేక సెహ్వాగ్, గంభీర్, జహీర్‌లు సెలక్టర్లను మెప్పించలేకపోతున్నారు. తాజాగా, ఆస్ట్రేలియా సిరీస్‌కు ఈ ముగ్గురిలో ఒక్కరిని కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఎంపిక సందర్భంగా వీళ్ల పేర్లే ప్రస్తావనకు రాలేదని తెలుస్తోంది.

మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా టూర్ సెహ్వాగ్‌కు చివరి అవకాశమని, అది అయిపోయిందని అభిప్రాయపడ్డారు. గంభీర్‌కు మాత్రం కొంత భవిష్యత్తు ఉందన్నారు. అతనిలో ఎంతో క్రికెట్ మిగిలి ఉందన్నారు. మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్.. సెహ్వాగ్ విషయమై స్పందిస్తూ ఓపెనింగ్ స్థానానికి విపరీతమైన పోటీ నెలకొని ఉందన్నారు. జట్టులోకి రావడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. మాజీలు జహీర్ పైన కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+