Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ సిక్స్ హీరో: ఫైనల్లో కప్ గెలిస్తే తాను కోరుకున్న చోటికి హనీమూన్

మెల్ బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ తొలిసారి పైనల్‌కు చేరడంలో గ్రాంట్ ఇలియట్ కీలకపాత్ర పోషించాడు. జట్టుని ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఇలియట్ మార్చి 29న జరిగే తన సోదరి కేట్ ఇలియట్ వివాహానికి హాజరు కాలేకపోతునందుక మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నాడు.

అయితే, న్యూజిలాండ్ గనుక వరల్డ్ కప్ గెలిస్తే తన సోదరి కోరుకున్ చోటుకి హనీమూన్‌కు పంపిస్తానని చెల్లికి మాట ఇచ్చాడు. ఈ సందర్భంలో కేట్ ఇలయట్ మాట్లాడుతూ ఈ పెళ్లి తేదీ ఏడాదికి ముందే ఫిక్స్ అయిందని పేర్కొన్నారు.

మార్చి 29న జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌ కోసం బుధవారం ఆక్లాండ్ నుంచి మెల్‌బోర్న్‌కు న్యూజిలాండ్ జట్టు చేరుకుంది. మెల్ బోర్న్‌కు జట్టు బయలు దేరడానికి ముందు తన అన్న అశీర్వాదాలు తనకు లభించాయని తెలిపారు.

 Black Caps hero Grant Elliott says he'll pay for sister's honeymoon

తన క్రికెట్‌లో రాణించడం కోసం ఎంతో కష్టపడ్డాడని, న్యూజిలాండ్ కోసం తొలిసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఇప్పుడు వచ్చిందని, కప్ గెలిస్తే తాను సంతోషించడంతో పాటు తను కూడా సంతోషంగా ఉంటానని తెలిపారు.

అక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో హీరోలుగా నిలిచారని, మెల్ బోర్న్‌లో కూడా హీరోలుగానే నిలవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక న్యూజిలాండ్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్హత సాధించి ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. ఫైనల్‌కు అర్హత సాధించడం వల్ల ప్రతి ఒక్క జట్టు సభ్యుడు $172,533 గెలుచుకున్నారు.

వరల్డ్ కప్ సెమీ పైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఐదవ బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గ్రాంట్ ఇలియట్ గెలిపించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+