Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింత: ఐరీష్ బ్యాట్స్‌మన్ బౌల్డయ్యాడు కానీ, ఔట్ కాలేదు(వీడియో)

బ్రిస్బేన్: క్రికెట్‌లో ఎప్పుడూ చూడని వింత ఘటన చోటు చేసుకుంది. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచులో ఐర్లాండ్ బ్యాట్స్‌మన్ ఎడ్ జాయ్స్ యుఏఈ బౌలర్ అమ్జద్ జావేద్ వేసిన వికెట్లకు తాకింది. వెంటనే ఎర్ర కాంతిని వెలువరించింది. అయితే బెల్స్ మాత్రం కదల్లేదు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 35 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయింది. పదో ఓవర్లో జావేద్ నాలుగో బంతిని వేశాడు. జాయ్స్ ఆ బంతిని మిస్ చేయడంతో నేరుగా వికెట్లకు తగిలింది. దీంతో బెల్స్ వెలిగింది. కొంత గాలి రావడంతో బెల్స్ కిందపడకుండా వికెట్లపైనే ఉండిపోయాయి. దీంతో జాయ్స్ నాటౌట్‌గా ప్రకటించబడ్డాడు.

Bizarre: Irish batsman Ed Joyce bowled but not out at World Cup

ఆశ్చర్యానికి గురైన బౌలర్, ఏమి చేయలేక అతని సహచరులతో కలిసి నవ్వుకున్నాడు. ఆ తర్వాత జాయ్స్ 16 పరుగులు చేశాడు. కాగా, జావేద్ తన ప్రతీకారాన్ని జాయ్స్‌ను మరో బంతిలో ఔట్ చేసి తీర్చుకున్నాడు. 18వ ఓవర్లో నాలుగో బంతి వేసిన జావేద్... జాయ్స్ వికెట్‌ను తీసుకున్నాడు. జావేద్ వేసిన బంతిని బాదిన జాయ్స్, స్వప్నిల్ పాటిల్‌కు క్యాచ్ ఇచ్చి 37 పరుగుల వద్ద ఔటయ్యాడు.

కాగా, ఇలాంటి బెల్స్ ఘటనే బిగ్ బాష్ లీగ్‌లో కూడా చోటు చేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్.. సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచులో డేవిడ్ హస్సీ రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. బంతి వికెట్లు తగిలినా బెల్స్ కిందపడకపోకపోవడంతో అతడు నాటౌట్‌గా మిగిలాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+