Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2022 కామన్వెల్త్ గేమ్స్ జరిగేది ఎక్కడో తెలుసా?

Birmingham officially named as 2022 Commonwealth Games host city

హైదరాబాద్: 2022లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ) ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరం దక్కించుకుంది. ఈ మేరకు సీడబ్ల్యూజీ సమాఖ్య అధ్యక్షుడు లూయిస్‌ మార్టిన్‌ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

నిజానికి 2022కు సంబంధించి 2015లోనే డర్బన్‌కు ఆతిథ్య హక్కులు కట్టబెట్టినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో మరో వేదికను ఎంపిక నిర్వహకులు ఎంపిక చేశారు. 2012 ఒలింపిక్స్ తర్వాత ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న మరో మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఇది.

2022 జూలై 27 నుంచి 7 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్‌ బడ్జెట్‌ 14 వేల కోట్లు (1.845 బిలియన్‌ యూరోలు)గా నిర్వాహకులు అంచనా వేశారు. దీంతో ఇప్పటి నుంచే బర్మింగ్ హామ్ నగరం ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది.

ఈ పోటీల ద్వారా రానున్న ఈ నాలుగేళ్లలో సుమారు 22,000 వేల ఉద్యోగాలను స్థానికులు పొందనున్నారు. టోర్నీ ద్వారా బర్మింగ్ హామ్ ప్రాంతంలో ఆర్ధికాభివృద్ధి జరుగుతుందని ఎకనిమిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ పోటీల కోసం బర్మింగ్ హామ్‌లో హోటల్ ట్యాక్స్‌ను అమల్లోకి తీసుకురానున్నారు.

ఒలింపిక్స్ తర్వాత క్రీడా ప్రపంచంలో జరిగే అతిపెద్ద క్రీడా సంబరం ఇది. 70 దేశాలకు చెందిన 5,000 మంది అథ్లెట్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. మొత్తం 18 విభాగాల్లో వీరంతా పోటీ పడతారు. 11 రోజుల పాటు జరిగే ఈ కామన్వెల్త్ గేమ్స్‌ను వీక్షించేందుకు సుమారు ఐదు లక్షల మంది బర్మింగ్ హామ్ నగరానికి వస్తారని వాటర్‌హౌస్ కూపర్ సంస్ధ అంచనా వేసింది.

తాజాగా బర్మింగ్ హామ్ ఆతిథ్య హక్కులను దక్కించుకోవడంతో గ్రేట్‌ బ్రిటన్‌లో మరో నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా మారనుంది. మాంచెస్టర్‌ (2002 కామన్వెల్త్‌), లండన్‌ (2012 ఒలింపిక్స్‌), గ్లాస్గో (2014 కామన్వెల్త్‌) ఇప్పటికే మెగా ఈవెంట్స్‌కు వేదికలుగా నిలిచాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 22, 2017, 11:29 [IST]
Other articles published on Dec 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+