
తొలిసారి ఇండియాకు గోల్డ్ మెడల్ అందించింది ఆయనే..!
1934లో తొలి కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లర్ రషీద్ అన్వర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. 1934 CWGలో కేవలం 6భారతీయ బృందాలు మాత్రమే పాల్గొన్నాయి. 1958లో మిల్కా సింగ్ 440గజాల రన్నింగ్ రేస్‌లో ఛాంపియన్‌గా నిలిచి ఇండియాకు తొలి బంగారు పతకాన్ని అందించాడు. అన్ని ఈవెంట్లలో ఇండియా గోల్డ్ మెడల్స్ సాధించుకుంటూ వస్తున్నా.. అథ్లెటిక్స్‌లో మాత్రం తదుపరి బంగారు పతకం మళ్లీ 2010లో వచ్చింది. డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా న్యూఢిల్లీలో జరిగిన 2010 CWGలో పునీయా గోల్డ్ మెడల్ సాధించాడు.

2010లో ఇండియా 38గోల్డ్ మెడల్స్‌తో 2వ స్థానంలో..
ఇక అమీ ఘియా, కన్వాల్ థాకర్ సింగ్ 1978లో కామన్ వెల్త్ గేమ్స్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళలుగా రికార్డు నెలకొల్పారు. వీరు బ్యాడ్మింటన్ డబుల్స్‌లో కాంస్యం సాధించారు. ఇప్పటివరకు మొత్తం కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 1966లో జమైకాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తొలిసారిగా ఒకే ఎడిషన్‌లో 10పతకాల మార్కును చేరుకుంది. 2010లో న్యూఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్లో భారత్ తరఫున 495మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో 38గోల్డ్ మెడల్స్ సాధించి ఇండియా 2వ స్థానంలో నిలిచింది. ఇది కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ తరఫున సాధించిన అత్యుత్తమ ప్రదర్శన.

ఈసారి మహిళల క్రికెట్ ప్రధాన ఆకర్షణ
ఇక కామన్వెల్త్ గేమ్స్ 2022లో కొన్ని కొత్త గేమ్స్ కూడా యాడ్ చేశారు. అందులో మహిళల క్రికెట్, బీచ్ వాలీబాల్, పారా టేబుల్ టెన్నిస్ ఉన్నాయి. వీటితో పాటు రోడ్ సైక్లింగ్, జూడో, ట్రయాథ్లాన్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్ వంటి క్రీడలు కూడా నిర్వహించనున్నారు. ఇకపోతే ప్రధాన ఆకర్షణ మహిళల క్రికెట్. మొత్తం ఎనిమిది మహిళా జట్లు పోటీపడతాయి. అందులో భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బార్బడోస్ ఉన్నాయి.

ఇండియాకు బొక్కపడే అవకాశం
ఈ కామన్ వెల్త్ గేమ్స్‌లో షూటింగ్ క్రీడను రద్దు చేశారు. ఇక 2018లో గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో భారతదేశం సాధించిన 66పతకాలలో 27షూటింగ్ ద్వారా సాధించినవే కావడం గమనార్హం. దీంతో ఇండియా పతకాల సంఖ్యలో కాస్త వెనకబడుతుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల కంటే మహిళా అథ్లెట్లకే ఎక్కువ పతకాలు అందనుండడం మరో విశేషం. ఇదో చారిత్రక ఘట్టం కాబోతుంది.


Click it and Unblock the Notifications












