
నిందితుడు నితీష్ కుమార్‌ను రైల్వే మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టామని, ఆ తర్వాత జైలుకు తరలించినట్లు జెహనాబాద్ పోలీస్ సుపరింటెండెంట్ ధూరత్ తెలిపారు. గయాలో తన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకుని రైలులో తన ఇంటికి వస్తున్న క్రమంలో క్రీడాకారిణి అశ్వని రాజ్ జెహనాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగింది.
అదే రైలులో దిగిన నలుగురు యువకులు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. క్రీడాకారిణి వారిని అడ్డుకోవడంతో ఆ యువకులు ఆమె దాడికి దిగారు. ఆమెను నిందితులు తరచూ వేధింపులకు గురిచేసేవారని బాధితురాలు తెలిపింది. బాధితురాలు 5వేల మీటర్ల పరుగు పందెం కోసం శిక్షణ తీసుకుంటోంది.
కాగా యువకుల దాడిలో గాయాలపాలైన బాధిత క్రీడాకారిణి ప్రస్తుతం జెహనాబాద్‌లోని సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డిసెంబర్ 7న గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభమయ్యే జాతీయ క్రీడల్లో అశ్వని రాజ్ పాల్గొనే అవకాశం లేకపోవచ్చని వైద్యలు పేర్కొన్నారు. కాగా బాధితురాలిని పరామర్శించిన ఎస్‌పి ధూరత్, ఆమె తొందరగా కోలుకుంటుందని చెప్పారు.