
లండన్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి గోల్డ్ మెడల్ సాధించింది. తన డిఫెండింగ్ టైటిల్‌ను కాపాడుకుంది. ప్రపంచ 42వ ర్యాంక్‌లో ఉన్న భారత ఫెన్సర్ మంగళవారం.. సీనియర్ మహిళల సాబెర్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో రెండో సీడ్ అయిన ఆస్ట్రేలియా స్టార్ ఫెన్సర్ వెరోనికా వాసిలేవాను 15-10తో ఓడించింది. ఈ గోల్డ్ మెడల్ ద్వారా ఆమె ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే మొట్టమొదటి భారతీయ ఫెన్సర్‌గా ఆమె పేరు తెచ్చుకుంది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచకప్‌లో 23వ స్థానంలో నిలిచిన అథ్లెట్‌కు ఈ పతకంతో పునరుత్తేజం వచ్చినట్లయింది.
కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ ఆమెకు ఈ ఏడాది 10వ అంతర్జాతీయ టోర్నమెంట్. తన విజయం తర్వాత భవాని మాట్లాడుతూ.. ఇది చాలా కఠినమైన ఫైనల్. ఈ సంవత్సరం నేను ఇండియాకు మరో గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ సంవత్సరం నాకు గొప్ప మజిలీ. రాబోయే రోజుల్లోనూ నేను ఇదే తరహా ఫామ్ కొనసాగించాలనుకుంటున్నాను. నాకు ఇండియాలో అపురూపమైన మద్దతు లభిస్తుంది అని ఆమె పేర్కొంది.
ఇక ఈ విజయం అనంతరం ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా మాట్లాడుతూ.. భవానీ దేవి భారతదేశం ఫెన్సింగ్ ఈవెంట్లో ఓ టార్చ్‌బేరర్. ఆమె భారతదేశంలోని ప్రతి ఫెన్సర్‌కు ప్రేరణగా నిలుస్తుంది. ఆమె కారణంగానే చాలా మంది యువత ఇప్పుడు గ్లోబల్ ఫెన్సింగ్‌లో తమను తాము నిరూపించుకోవడానికి చూస్తున్నారు. ఈ గోల్డ్ మెడల్ ద్వారా ఇండియాలో ఫెన్సింగ్ క్రీడకు ఆదరణ పెరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో భారత ఫెన్సర్లు క్రమం తప్పకుండా పోటీపడే రోజులు ఎంతో దూరంలో లేవని అతను చెప్పాడు.