Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొదటి వన్డేలో భారత్ విజయం: కోహ్లీ అద్భుత సెంచరీ

Kohli
గౌహతి: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య గౌహతిలోని నెహ్రూ స్టేడియంలో మొదటి వన్డేలో భారత్ విజయం సాధించింది. 40 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. సీనియర్లు లేకుండా కేవలం అంతా యువ ఆటగాళ్లే ఆడారు. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్‌ మరో ఓవర్ మిగిలి ఉండగానే 49 ఓవర్లలలో 276 పరుగులు చేసి అన్ని వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండు ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరి 20 పరుగులలోనే 5 వికెట్లు కోల్పోయింది. యువ సంచలనం విరాట్ కోహ్లీ 104 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఓపెనర్లు విజయ్‌29, గంభీర్‌ 38 పరుగులకు ఔటయ్యారు. యువరాజ్‌ 42, రైనా 13, వర్థమాన్‌ షా 4, అశ్విన్‌ 0, నెహ్రా 0, శ్రీశాంత్‌ 4లు తక్కువ పరుగుల వద్దనే అవుటయ్యారు. ఐదు వన్డేల సిరీస్లో 1-0 తో భారత్ ముందంజలో ఉంది.

ఆఖర్లో వచ్చిన యూసఫ్‌ పఠాన్‌ 19 బంతుల్లో 29 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాడు. పటేల్‌ 1పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలలో మెకే నాలుగు, మిల్స్‌ మూడు, టఫే రెండు వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్ చెసిన న్యూజిలాండు 45.2 ఓవర్లలోనే 236 పరుగులకే ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ తరఫున టేలర్ 66 పరుగులు, మెకల్లమ్ 35, మిల్స్ 32, గుప్తిల్ 30 పరుగులు చేశారు. శ్రీశాంత్ 3 వికెట్లు, అశ్విన్ 3, యువరాజ్ 3 వికెట్లు, నెహ్రా 1వికెట్ తీసుకున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+