న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంబులెన్స్‌లో ప్రయాణించిన టీమిండియా ఆటగాళ్లు

బెంగళూరు: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ వర్షం కారణంగా రద్దవడంతో చిన్నస్వామి స్టేడియం నుంచి హోటల్ వెళ్లేందుకు టీమిండియాలోని కొందరు ఆటగాళ్లు అంబులెన్స్‌ను ఆశ్రయించారు. ఆటగాళ్లెవరూ గాయపడనప్పటికీ స్టేడియం నుంచి హోటల్ చేరుకునేందుకు అంబులెన్స్‌ను ఉపయోగించారు.

వర్షం కారణంగా రెండో టెస్ట్ రద్దై డ్రాగా ముగడియంతో స్టేడియంలో ఉన్న ఆటగాళ్లు తిరిగి వారుంటున్న హోటల్‌కి వెళ్లిపోయారు. ప్రస్తుతం టీమిండియా 4-0తో దక్షిణాఫ్రికాపై ఆధిక్యం సాధించింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోని చాలా మంది బుధవారం టీం బస్సులోనే హోటల్‌కు వెళ్లిపోయారు. అయితే కొంత నెట్‌లో ప్రాక్టీస్ చేసుకునేందుకు స్టేడియంలోనే ఆగిపోయారు.

 Bengaluru Test: Indian players travel in ambulance to reach hotel

అయితే, ఆ బస్సు తిరిగి వచ్చేంత వరకు వేచి ఉండటం ఎందుకని శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, స్టువర్ట్ బిన్నీ, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌లు స్టేడియంలో నిలిపి ఉంచిన అంబులెన్స్‌లో హోటల్ చేరుకున్నారు.

అంబులెన్స్ డ్రైవర్ పక్క సీటులో స్టువర్ట్ బిన్నీ కూర్చోగా, ధావన్, రాహుల్, బంగర్ వెనక సీటులో కూర్చున్నారు. స్టేడియం నుంచి వీరంతా సురక్షితంగా హోటల్ చేరుకున్నారు. బిన్నీ, రాహుల్‌ బెంగళూరు నగరానికి చెందినవారే. కాగా, మూడో టెస్ట్ నవంబర్ 25న నాగపూర్‌లో ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X