Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏం గుండెరా అది.. 40ఏళ్ల వయసులో స్టార్ ప్లేయర్ కళ్లు చెదిరే రికార్డ్!

రంగం ఏదైనా .. పట్టుదల, ఉత్సాహం, లక్ష్యం ఉండాలే కానీ.. వయసుతో సంబంధం లేకుండా తాము అనుకున్నది సాధిస్తామని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని ప్రూవ్ చేశారు. క్రీడారంగంలోనూ మనం ఇలాంటి వారిని అరుదుగా చూస్తూనే ఉంటాం. సాధారణంగా క్రీడల్లో 35 ఏళ్లు దాటగానే ఆటగాళ్లు కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించేస్తుంటారు.

చాలా తక్కువ మందే 40 ప్లస్ ఏజ్ లోనూ ఆడుతూ అభిమానులను అలరించడంతో పాటు ఆశ్చర్యపరుస్తుంటారు. పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటుంటారు. తాజాగా ఓ స్టార్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా లేటు వయసులో ఓ సూపర్ రికార్డ్ సాధించి ఔరా అనిపించాడు.

Basketball player LeBron James creates history by scoring 40 points at age 40 in NBA

ఇంతకీ అతడెవరంటే?
అమెరికా బాస్కెట్‌బాల్‌ స్టార్‌ లెబ్రాన్‌ జేమ్స్‌ తన కెరీర్ లో మరో అరుదైన ఘనత సాధించాడు. లేటు వయసులో ఇప్పుడతడు ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అమెరికా స్పోర్ట్స్ లీగ్ ఎన్‌బీఏలో లాస్‌ ఏంజెలెస్‌ లాకర్స్‌ తరఫున లెబ్రాన్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు.. 42 పాయింట్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఎన్‌బీఏ గేమ్ లో లేటు వయసులో 40కుపైగా పాయింట్లు సాధించిన ఓల్డెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. మైకేల్‌ జోర్డాన్‌ తర్వాత నలభై ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

జోర్డాన్ 40 ఏళ్ల 4 రోజుల వయసులో 43 పాయింట్లు సాధించాడు. 2003లో వాషింగ్టన్ విజార్డ్స్ తరఫున ఆడుతూ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పుడు లెబ్రాన్ 40 ఏళ్ల 38 రోజుల వయసులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇన్నేళ్ల తర్వాత తన ఆరాధ్య ఆటగాడి రికార్డుకు చేరుకున్నాడు.

థ్రిల్లింగ్ విక్టరీ..
లెబ్రాన్‌ దూకుడు ప్రదర్శనతో లాస్‌ ఏంజెలెస్‌ జట్టు 120-112 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. గోల్డెన్‌ స్టేట్‌ వారియర్స్‌ను ఓడించి ఈ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ప్రస్తుతం బాస్కెట్ బాల్ ప్రపంచంలో అంతా లెబ్రాన్ గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Saturday, February 8, 2025, 7:12 [IST]
Other articles published on Feb 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+