ఢాకా: రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ వరల్డ్‌కప్ హీరో రుబెల్ హుస్సేన్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈ స్టార్ ఫాస్ట్‌బౌలర్‌పై 20 ఏండ్ల సినీ తార నజ్నిన్ అక్తర్ హ్యాపీ దాఖలు చేసిన అత్యాచారం అభియోగాలను బంగ్లాదేశ్ కోర్టు బుధవారంనాడు కొట్టివేసింది.
ఈ కేసులో నిజానికి అత్యాచారానికి సంబంధించి రుబెల్‌పై ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని విచారణ జరిపిన పోలీసులు కోర్టుకు వెల్లడించారు. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా కోర్టులో అప్పీల్ దాఖలు చేస్తామని నజ్నిన్ తరఫు న్యాయవాది అన్నాడు.
రుబెల్ హుస్సేన్ పై నజ్నీన్ హ్యాపీ నిరుడు డిసెంబర్‌లో అత్యాచారం ఆరోపణలు చేసింది. తమ ఇరువురి మధ్య సన్నిహిత సంబంధం ఉందని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రుబెల్ మోసం చేశాడని ఆమె ఆరోపించింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో ఇంగ్లాండుపై బంగ్లాదేశ్ నాటకీలంగా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత మార్చిలో తాను రుబెల్ చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుంటానని చెప్పింది. అయితే, ఆ తర్వాత కేసు విషయంలో ముందుకే
రుబెల్ హుస్సేన్ అపార్టుమెంటులోని వస్తులపై వీర్యానికి సంబంధించిన ఆనవాళ్లు పోలీసులకు కనిపించ లేదని, దాంతో కోర్టు ఆ తీర్పు ఇచ్చిందని రుబెల్ తరఫు న్యాయవాది మోనిరుజ్జమాన్ భూయాన్ చెప్పారు. హ్యాపీ ఫిర్యాదు చేసిన తర్వాత రుబెల్ అపార్టుమెంటులోని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.