ఆసియా చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కు స్వర్ణం

ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజర్లు సత్తా చాటారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణం గెలుపొందాడు. దీంతో అతను వరుసగా రెండో ఏడాదీ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. మరో ఇద్దరు రెజర్లు ప్రవీణ్ రాణా రజతం.. సత్యవర్త్ కడియాన్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
గత కొంతకాలంగా అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్న బజ్‌రంగ్.. అంచనాలను అందుకుని ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మెరిశాడు. మంగళవారం పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో బజ్‌రంగ్ 12-7తో కజకిస్థాన్ క్రీడాకారుడు సయాత్‌బెక్ ఒకసోవ్‌ను ఓడించాడు. ఒకదశలో 2-7తో వెనుకబడిన బజరంగ్ గెలుస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఐతే బజరంగ్ ఒక్కసారిగా దూకుడు పెంచి 8 పాయింట్లు సాధించాడు. చివరి నిమిషంలో బజ్‌రంగ్ దాడికి ఒకసోవ్ ఓటమిపాలయ్యాడు. 2017లోనూ బజరంగ్ స్వర్ణం గెలిచాడు.
మరో భారత బాక్సర్ పర్వీన్ రాణా రజత పతకం సాధించాడు. 79 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో పర్వీన్ 0-3తో ఇరాన్‌కు చెందిన మహ్మద్ తెయ్‌మౌరి చేతిలో ఓడిపోయాడు. 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్ కాంస్య పతకంతో మెరిశాడు. కాంస్య పతక పోరులో సత్యవర్త్ 8-2తో చైనా ఆటగాడు హావోబిన్ గావోపై గెలుపొందాడు. ఇక 57 కేజీల విభాగం కాంస్య పతక పోరులో రవి కుమార్ 3-5తో జపాన్ ఆటగాడు యూకీ తకహాషి చేతిలో ఓటమి పాలయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications