Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలీ అలియెవ్‌ రెజ్లింగ్‌ టోర్నీలో బజరంగ్‌కు స్వర్ణం

Bajrang Punia Wins Gold At Ali Aliev Wrestling Tournament

భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా జోరు కొనసాగుతోంది. తాజాగా ముగిసిన ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన పునియా.. మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రష్యాలో జరిగిన అలీ అలియెవ్‌ రెజ్లింగ్‌ టోర్నీలో పునియా స్వర్ణం పతకం గెలుచుకున్నాడు. గురువారం జరిగిన 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్‌ 13-8 పాయింట్ల తేడాతో విక్టర్‌ రసాదిన్‌ (రష్యా)పై గెలుపొందాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఫైనల్లో ఒక దశలో 0-5తో వెనకబడ్డ బజరంగ్‌.. అనంతరం పుంజుకుని స్వర్ణం గెలిచాడు. రసాదిన్‌పై చివరిగా 2017 డాన్‌ కొలవొవ్‌ టోర్నీలో తలపడ్డ పునియా విజేతగా నిలిచాడు. ఈ ఏడాది బజరంగ్‌కిది వరుసగా మూడో స్వర్ణ పతకం. డాన్‌ కొలోవ్‌ టోర్నీలో స్వర్ణం నెగ్గిన బజరంగ్‌.. ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

Story first published: Friday, May 3, 2019, 10:24 [IST]
Other articles published on May 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+