For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ పార్టీలో చేరితే నాపై నిషేధం ఎత్తేస్తారు: బజరంగ్ పునియా

డోపింగ్ పరీక్షకు నమూనా ఇవ్వడానికి నిరాకరించి నాలుగేళ్ల పాటు నిషేధానికి గురైన భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజకీయపరమైన కారణాలతోనే తనపై నిషేధం పడిందని పేర్కొన్నాడు. బీజేపీలో చేరితే తనపై నిషేధం ఎత్తివేస్తారని బజరంగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

జాతీయ జట్టు ఎంపిక ట్రయల్స్‌లో డోపింగ్ పరీక్ష కోసం నమూనాను సమర్పించడానికి నిరాకరించినందుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నాలుగేళ్ల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే నేరానికి సంబంధించి తొలుత ఏప్రిల్‌లో నాడా బజరంగ్‌పై తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత 'నాడా క్రమశిక్షణ సంఘం' (ఏడీడీపీ) బజ్‌రంగ్‌పై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. నాడా తదుపరి నోటీసులు ఇచ్చేదాకా బజ‌రంగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్టు ఏడీడీపీ తెలిపింది.

Bajrang Punia Claims NADA Suspension Tied to Politics If I Join BJP My Bans Will Be Lifted

ఎక్స్‌పైరీ అయిన కిట్‌లు వాడటంపై తాను అడిగిన ప్రశ్నలకు నాడా బదులివ్వలేదని బజర్ంగ్ పునియా వివరణ ఇవ్వడంతో.. ఏడీడీపీ తాత్కాలింకగా సస్పెన్షన్‌ను రద్దు చేసింది. కానీ నాడా ఛార్జ్ నోటీసులతో మరోసారి కొరడా ఝుళిపించి నిషేధాన్ని కొనసాగించింది. తాజాగా, బజరంగ్ డోపింగ్ నిబంధలు ఉల్లంఘించినట్లు ఏడీడీపీ గుర్తించింది. ఆర్టికల్ 10.3.1 ప్రకారం ఆంక్షలకు బజరంగ్ అతనిపై సస్పెన్షన్ వేటును కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి నాలుగేళ్ల పాటు బజరంగ్‌పై అనర్హత వేటు కొనసాగుతోందని ప్యానెల్ వివరించింది.

అయితే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకే తనపై వేటు పడిందని బజరంగ్ పునియా ఆరోపించాడు. కేంద్ర సంస్థలన్నీ బీజేపీ చేతుల్లోనే ఉన్నాయని, తనపై ప్రతీకారం తీర్చుకునేందుకే నిషేధం విధించారని అన్నాడు. బీజేపీలో చేరితే తనపై నిషేధాన్ని ఎత్తివేస్తారని పేర్కొన్నాడు. బ్రిజ్ భూషణ్‌పై నిరసనల అనంతరం బజరంగ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. హర్యానా ఎన్నికల్లో కూడా ప్రచారం చేశాడు.

Story first published: Thursday, November 28, 2024, 14:35 [IST]
Other articles published on Nov 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+