న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ నెం.1గా నిలిచిన బజరంగ్

Bajrang Poonia Mens freestyle 65kg world rankings in the worlds No. 1 wrestler

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా మరో అరుదైన ఘనత సాధించాడు. ఇటీవలే ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందిన అతను తాజాగా యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ర్యాంకింగ్స్‌ 65 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అధిరోహించాడు. ఈ సీజన్‌లో అద్భుత విజయాలతో ఐదు పతకాలను సాధించిన బజరంగ్ 96 పాయింట్లతో యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్‌ర్యాంక్ చేరాడు.

ప్రతి అథ్లెట్ కల ప్రపంచ నంబర్‌వన్ కావడం. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి ఈ ర్యాంక్ అందుకుంటే ఇంకా సంతోషించేవాడిని. వచ్చే ఏడాది తప్పకుండా స్వర్ణం సాధించి నా నంబర్‌వన్ ర్యాంక్‌ను కాపాడుకుంటాను అని బజరంగ్ అన్నాడు. కామన్‌వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన బజరంగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. దాదాపు పాల్గొన్న ప్రతి టోర్నీలోనూ మెరుగైన స్థాయిలో రాణించడంతో పాయింట్ల పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

గతంలో ఏ భారతీయ రెజ్లర్‌ కూడా నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించలేదు. హరియాణాకు చెందిన 24 ఏళ్ల బజరంగ్‌ 96 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. తోబియర్‌ (క్యూబా-66 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో... చకయెవ్‌ (రష్యా-62 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నారు. పురుషుల ర్యాంకింగ్స్‌లో టాప్10లో బజరంగ్ ఒక్కడే కొనసాగుతుండగా.. మహిళల విభాగం టాప్ 10లో ఐదుగురు భారత రెజ్లర్లు స్థానం దక్కించుకోవడం గమనార్హం.

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం అందుకున్న పూజాదండా 57 కేజీల విభాగంలో ఆరోస్థానంలో కొనసాగుతుండగా.. రీతూ ఫొగట్ 50 కేజీల విభాగంలో టాప్ 10లో చోటు దక్కించుకోగా.. సరితా మోర్ 59 కేజీల విభాగంలో ఏడో స్థానంలో నిలిచింది. నవజోత్ కౌర్ 68 కేజీల విభాగంలో, కిరణ్ 76 కేజీల విభాగంలో తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నారు.

65 కిలోల విభాగంలో మొత్తం 96 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ర్యాంకింగ్స్‌లో తన సమీప ప్రత్యర్థి కంటే 30 పాయింట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలవడంతో అతడి ర్యాంకింగ్‌ దూసుకెళ్లింది.

Story first published: Sunday, November 11, 2018, 11:57 [IST]
Other articles published on Nov 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X