Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బజ్జీపై జాతి వివక్ష ఆరోపణల ఎత్తివేత


ముంబయి: భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ పై జాతి వివక్ష ఆరోపణలను ఎత్తివేశారు. మ్యాచ్ రెఫరీ మైక్ ప్రోక్టర్ తీర్పుకు వ్యతిరేకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) చేసిన అపీల్ పై ఐసిసి నియమించిన కమీషనర్ న్యూజిలాండ్ న్యాయమూర్తి జాన్ హన్సన్ విచారణ జరిపారు. సిడ్నీ టెస్టులో దూషణలకు దిగినందుకు గాను హర్బజన్ ఫీజులో 50 శాతం కోత విధించారు.

హర్బజన్ పై నిషేధం ఎత్తివేతతో అన్ని పక్షాలూ సంతృప్తి చెందాయి. హర్భజన్ సైమండ్స్ పై జాతి వివక్ష ఆరోపణలు చేశాడనే ఆరోపణలను అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. హర్భజన్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేయలేదని భారత సీనియర్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ చెప్పాడు. హర్బజన్ పై జాతి వివక్ష ఆరోపణలను ఉపసంహరించుకునే విషయమై అంతకుముందు భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
Story first published: Tuesday, January 29, 2008, 11:51 [IST]
Other articles published on Jan 29, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+