For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రీ విజేతగా లూయిస్ హామిల్టన్‌

By Nageshwara Rao
Azerbaijan GP: Hamilton beats Raikkonen as Red Bull implode in Baku

హైదరాబాద్: బాకు వేదికగా జరిగిన అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రీ ఫార్ములా వన్‌ రేస్‌ను ఫార్ములావన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ గెలుచుకున్నాడు. ఆదివారం అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ ప్రిని హామిల్టన్‌ (మెర్సిడెజ్‌) సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.

ఫెరారీ డ్రైవర్‌ రైకోనెన్‌కు రెండో స్థానం దక్కించుకోగా, ఫోర్స్‌ ఇండియాకు చెందిన సెర్గియో పెరెజ్‌ మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా 36 రేసుల తర్వాత భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్‌ ఓ ఫార్ములావన్‌ రేసులో టాప్‌-3లో నిలిచాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును పెరెజ్‌ గంటా 43 నిమిషాల 48.315 సెకన్లలో పూర్తి చేశాడు.

మరోవైపు హామిల్టన్‌ (మెర్సిడెస్‌) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్నాడు. హామిల్టన్‌ గంటా 43 నిమిషాల 44.291 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని పొందాడు. ఇక, పోల్‌ పోజిషన్‌ నుంచి రేసు మొదలెట్టిన సెబాస్టియన్‌ వెటెల్‌ (ఫెరారీ) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Story first published: Monday, April 30, 2018, 9:44 [IST]
Other articles published on Apr 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+