Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కారణం ఇదీ: యుఎస్ ఓపెన్‌కు అజరెంకా దూరం

హైదరాబాద్: మాజీ నెంబర్‌వన్, రెండుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ విజేత విక్టోరియా అజరెంకా (బెలారస్‌) ఆగస్టు 28 (సోమవారం) నుంచి ఆరంభమయ్యే యుఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకుంది.

గతేడాది డిసెంబర్‌లో అజరెంకాకు బాబు జన్మించిన సంగతి తెలిసిందే. వింబుల్డన్ టోర్నీ అనంతరం ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌ బిల్లీ మెక్‌కీగ్‌ నుంచి విడిపోయింది. అయితే ఇప్పుడు కుమారుడు సంరక్షణ విషయంలో ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మధ్య వివాదం నడుస్తోంది.

Azarenka withdraws from US Open amid child custody dispute

దీంతో కొన్ని న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకునే నేపథ్యంలో యూఎస్‌ ఓపెన్‌లో ఆడటం లేదని అజెరంకా ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో అజరెంకా తిరిగి కోర్టులో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజరెంకా 204వ ర్యాంకులో కొనసాగుతోంది.

యుఎస్ ఓపెన్‌లో అజరెంకాతో పాటు మొదటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్న సెరెనా విలియమ్స్ తప్పుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగానికి వస్తే గాయాల కారణంగా టాప్-10లోని ముగ్గురు ప్లేయర్స్ యుఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+