హైదరాబాద్: తాను హైదరాబాద్ అమ్మాయి అయేషాను పెళ్లి చేసుకోలేదంటూనే అయేషా కుటుంబంపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షోయెబ్ మాలిక్ అనడంపై అయేషా తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఒక టీవీ షోకిచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ మాలిక్ అయేషా కుటుంబంపై పలు ఆరోపణలు చేశారు. షోయెబ్ మాలిక్ ను కోర్టుకు ఈడుస్తామని అయేషా తండ్రి సిద్దిఖి అంటున్నారు. పెళ్లికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన అంటున్నారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ కాగానే షోయెబ్ మాలిక్ ప్రవర్తన మారిపోయిందని ఆయన చెబుతున్నారు. ఈ పెళ్లి వ్యవహారంతో అనారోగ్యానికి గురైన అయేషా ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని ఆయన చెబుతున్నారు. తనకు వేరే అమ్మాయి ఫొటో చూపించారని, నిఖాకు పదే పదే డిమాండ్ చేశారని మాలిక్ అయోషా కుటుంబంపై ఆరోపణలు చేశారు.