Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అయేషా నిజమే చెప్తోంది: అమీన్ షేక్

Shoaib Malik
న్యూఢిల్లీ: షోయబ్ మాలిక్ తనను పెళ్లాడినట్లు హైదరాబాద్ అమ్మాయి అయేషా సిద్దిఖి నిజమే చెప్తోందని షోయబ్ మాలిక్ కుటుంబ మిత్రుడు అమీన్ షేక్ అన్నారు. టైమ్స్ నౌకు ఆయన ఆ విషయం చెప్పారు. అయేషా సిద్దిఖి ఫొటో తాను చూశానని ఆయన చెప్పారు. తనకు చూపిన అయేషా సిద్దిఖిదేనని ఆయన అన్నారు. అయితే ఆ ఫొటోలో కాస్తా సన్నగా ఉన్నట్లు కనిపించిందని ఆయన అన్నారు.

షోయబ్ పెళ్లికి ఎంచుకున్న అమ్మాయి ఆమెనే అని, షోయబ్, అయేషా దుబాయ్ లో మిత్రులని, ఆ స్నేహం గురించి షోయబ్ తండ్రి తనకు చాలాసార్లు చెప్పారని ఆయన అన్నారు. ఆయేషా సిద్దిఖి పట్ల జరుగుతున్న వ్యవహారం తనకు విచారం కలిగిస్తోందని ఆయన అన్నారు. షోయబ్ సానియాను పెళ్లి చేసుకుంటున్నట్లు వింటున్నానని, ఏమైందో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

అయేషాతో పెళ్లి జరిగిందని, రుక్సత్ మాత్రమే మిగిలి ఉందని షోయబ్ తండ్రి తనకు చెప్పినట్లు ఆయన తెలిపారు. షోయబ్ తండ్రి తనకు అయేషా ఫొటో చూపించాడని, తాను ప్రస్తుతం టీవీల్లో చూస్తున్న చిత్రాలు ఆ అమ్మాయివేనని, అయితే ఇంతకు ముందు కాస్తా సన్నగా ఉండేదని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+