Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డివిల్లియర్స్‌ను ఎలా అవుట్ చేశానంటే..: అక్షర్ పటేల్

మొహాలీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బౌలర్ అక్షర్ పటేల్.. బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్‌ను ఔట్ చేశాడు. బెంగళూరు జట్టులో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌‍లు బాగా ఆడుతున్నారు.

పంజాబ్ కంటే ముందు జరిగిన మ్యాచ్‌లో ఏపీ డివిల్లియర్స్ 59 బంతుల్లో 133 పరుగులు చేశాడు. అయితే, బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో బెంగళూరు 22 పరుగుల తేడాతో ఓడింది.

వర్షం పడటంతో మ్యాచ్‌ను పది ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ పది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేసింది.

Axar Patel reveals how he planned and got AB de Villiers out

క్రిస్ గేల్.. సందీబ్ బౌలింగులో సాహాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లీ అనురీత్ బౌలింగులో బౌల్డ్ అయ్యాడు. అనంతరం వచ్చిన డివిల్లియర్స్‌ (9 బంతుల్లో 10 పరుగులు) అక్షర్ పటేల్ బౌలింగులో అవుట్ అయ్యాడు. అక్షర్ వేసిన ఏడో ఓవర్లో అవుటయ్యాడు.

అక్షర్ రెండు ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి పదకొండు పరుగులు ఇచ్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తాను డివిల్లియర్స్‌ను ఎలా అవుట్ చేశాననే విషయం అక్షర్ పటేల్ చెప్పాడు.

డివిల్లియర్స్ మైదానం మొత్తం.. అన్ని వైపులా ఆడుతున్నాడని, దీంతో ప్లాన్ చేసుకోవడం సులభమని, అతడు మైదానం మొత్తం ఆడుతున్న నేపథ్యంలో.. తాను నేరుగా స్టంప్స్‌కు వేశానని చెప్పాడు. దీంతో, అతను అవుటయ్యాడని చెప్పాడు. అక్షర్ బౌలింగులో డివిల్లియర్స్ షాట్ కొట్టగా దానిని హెడ్రింక్స్ క్యాచ్ పట్టాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+