Tokyo Olympics 2021: చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా స్విమ్మ‌ర్‌.. ఒకే ఒలింపిక్స్‌లో 7 పతకాలు!!

టోక్యో: ఎమ్మా మెక్‌కియాన్.. టోక్యో ఒలింపిక్స్‌ 2020లో ఇప్పుడు ఈ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. భారత దేశం ఒక్క పతకం గెలిచి సంబరపడుతుంటే.. ఆస్ట్రేలియాకు చెందిన మహిళా స్విమ్మర్‌ ఎమ్మా ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించి చ‌రిత్ర సృష్టించింది. దీంతో స్విమ్మింగ్‌ విభాగంలో తనకు ఎదురులేదని ఎమ్మా నిరూపించింది. ఆదివారం జరిగిన మ‌హిళ‌ల 4×100 మీట‌ర్ల రిలే ఈవెంట్‌లో ఆస్ట్రేలియా త‌ర‌ఫున గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డం ద్వారా ఎమ్మా ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఎమ్మా మొత్తం ఏడు విభాగాల్లో ఏడు పతకాలు సాధించింది. ఇందులో నాలుగు స్వర్ణాలు కాగా.. మూడు క్యాంస్యాలు ఉన్నాయి.

100 ఫ్రీస్టైల్‌, 4x100 ఫ్రీస్టైల్‌ రిలే , 50 ఫ్రీస్టైల్‌, 4x100 మెడ్లీరిలేల్లో స్వర్ణం గెలిచిన ఎమ్మా మెక్‌కియాన్.. 100 బటర్‌ఫ్లై, 4x200 ఫ్రీస్టైల్‌ రిలే, 4x100 మిక్స్‌డ్‌ మెడ్లీరిలే విభాగాల్లో క్యాంస్యం గెలిచింది. 1952లో సోవియట్ జిమ్మాస్ట్ మరియా గోరోకోవిస్కయ రికార్డును ఎమ్మా సమం చేసింది. అలాగే స్విమ్మింగ్ లెజెండ్ ఇయాన్ తోర్ప్ రికార్డును అధిగమించి.. ఆస్ట్రేలియా తరపున మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించింది. ఈ ఒలింపిక్స్‌లో ఎమ్మా తర్వాతి స్థానంలో అమెరికన్‌ ఫ్రీ స్టైల్‌ స్మిమ్మర్‌ కాలెబ్‌ డ్రెసెల్‌ 5 పతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు.

Tokyo Olympics 2021: 13 కుట్లు పడినా.. అలాగే పోరాడిన సతీశ్‌ కుమార్‌!!Tokyo Olympics 2021: 13 కుట్లు పడినా.. అలాగే పోరాడిన సతీశ్‌ కుమార్‌!!

ఓవరాల్‌గా ఎమ్మా మెక్‌కియాన్‌ 2016 రియో ఒలింపిక్స్‌ కలుపుకొని ఇప్పటివరకు 11 పతకాలు సాధించి ఆస్ట్రేలియా తరపున అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఒక ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు కొల్లగొట్టిన ఆటగాడిగా అమెరికాకు చెందిన మైకెల్‌ పెల్స్‌ తొలి స్థానంలో ఉన్నాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పెల్స్‌ 8 పతకాలతో మెరవగా.. అవన్నీ స్వర్ణ పతకాలే కావడం విశేషం. ఎమ్మా మెక్‌కియాన్‌తో పాటు కేలీ మెక్‌కియోన్‌, చెల్సీ హాడ్జెస్‌, కేట్ క్యాంప్‌బెల్‌ల‌తో కూడిన ఆస్ట్రేలియా టీమ్ రెండుసార్లు డిఫెండింగ్ చాంపియ‌న్ అమెరికాకు షాకిచ్చింది.

అమెరికా పురుషుల స్విమ్మ‌ర్లు ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేశారు. స్టార్ స్విమ్మ‌ర్ కెలెబ్ డ్రెసెల్ నేతృత్వంలోని అమెరికా 4×100 మీట‌ర్ల మిడ్లే రిలే టీమ్ రికార్డు టైమ్‌లో రేసు పూర్తి చేసింది. 3 నిమిషాల 26.78 సెక‌న్ల‌లో పూర్తి చేసి 2009 ప్రపంచ చాంపియ‌న్‌షిప్స్‌లో న‌మోదైన 3:27.17 నిమిషాల రికార్డును బ్రేక్ చేసింది. ఈ రిలేలో బ్రిట‌న్ (3:27.51), ఇట‌లీ (3:29.17) త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొదటిలో అమెరికా స్విమ్మ‌ర్‌ ఆండ్రూ బ్రెస్ట్ర్‌స్ట్రోక్ లెగ్ పూర్త‌య్యే స‌రికి బ్రిట‌న్ కంటే 20 మీట‌ర్ల దూరంలో నిలిచింది. అయితే డ్రెసెల్ బ‌ట‌ర్‌ఫ్లై లెగ్ మొత్తం మార్చేసింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, August 1, 2021, 15:05 [IST]
Other articles published on Aug 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X