స్విమ్మర్లకు శుభవార్త: భారత్‌లో స్టెఫానీ రైస్ స్విమ్మింగ్ అకాడమీ!

హైదరాబాద్: ఆస్ట్రేలియా స్విమ్మింగ్ లెజెండ్ స్టెఫానీ రైస్ భారత్‌లో తన సొంత స్విమ్మింగ్ అకాడమీ నెలకొల్పనుంది. 2024, 2028 ఒలింపిక్స్‌లో భారత్ స్విమ్మర్లు పతకాలు సాధించాలన్న లక్ష్యంతో ఆమె ఈ అకాడమీని నెలకొల్పబోతున్నట్లు వెల్లడించింది. స్టెఫాన్ రైస్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇండియాకి వచ్చిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలోని ప్రతి ఒక్క కోచ్ కూడా ట్రైనింగ్ తీసుకున్నవారే. మైకేల్ ఫిలిప్స్, నా కోచ్ మైకేల్ బోల్ ఎలాగైతే కోచింగ్ తీసుకున్నారో అలాగే. వారు ప్రపంచంలోని అత్యుత్తమ కోచ్‌లలు వారి అథ్లెట్లను ఎలా తీర్చిదిద్దుతారో చూశారు" అని అన్నారు.

సొంత అకాడమీని నెలకొల్పాని
"ఈ కారణం చేతనే నేను నా సొంత అకాడమీని నెలకొల్పాని భావించా. ఇందులో భాగంగా హై లెవెల్ కోచ్‌లను ఇక్కడి తీసుకు రావాలని అనుకుంటున్నా. భారత స్మిమ్మర్లకు సరైన శిక్షణ ఇస్తే మెరుగవుతారు. భారత్‌లో స్విమ్మింగ్‌కు ఎంతో ఆదరణ ఉంది. ఇక్కడ ప్రతిభావంతులకు కొదువ లేదు. వారిని గుర్తించి సానబట్టాలి" అని స్టెఫానీ రైస్ తెలిపింది.

2012 లండన్ ఒలింపిక్స్
2012 లండన్ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత స్టఫానీ రైస్‌కు మూడు షోల్డర్ సర్జరీలు జరిగాయి. లండన్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో నాలుగో స్థానంలో నిలిచిన రైస్... 400 మీటర్ల మెడ్లీలో ఆరో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2014లో స్విమ్మింగ్‌కు స్టెఫానీ రైస్ వీడ్కోలు పలికింది.

స్విమ్మింగ్ అనేది సంసృతిలో భాగం
భారత్‌లో స్విమ్మింగ్ అనేది సంసృతిలో భాగంగా ఉందని అయితే మౌలిక వసతులు కల్పన అనేది సరిగా లేవని అన్నారు. "గత మూడేళ్లుగా నేను ఇండియాలో అనేక స్విమ్మింగ్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా ఇక్కడ స్విమ్మింగ్ సంస్కృతిని గమనించాను" అని స్టెఫానీ రైస్ చెప్పుకొచ్చారు.

విజయవంతమైన స్మిమ్మర్లు
"భారత్‌లో విజయవంతమైన స్మిమ్మర్లుగా పేరుగాంచిన వారు యుఎస్ఏ, థాయిలాండ్, ఆస్ట్రేలియలలో శిక్షణ తీసుకున్నారు. ఆయా దేశాల్లోని గ్రేట్ కోచింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు కాబట్టి. ఇండియాలో ముఖ్యంగా హై ఫెర్పామెన్స్ కోచ్‌లు లేకపోవడం వల్ల వెనుకబడి ఉంది" అని ఆమె తెలిపారు.

బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకాల పంట
ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక గేమ్స్‌లో అథ్లెట్లతో పాటు స్విమ్మింగ్‌లో కూడా అలవోకగా స్వర్ణ పతకాలను గెలుచుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ, 200 మీటర్ల ఫ్రీ స్టయిల్ రీలేలో స్టెఫానీ రైస్ పతకాలను గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications