Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గర్ల్‌ఫ్రెండ్‌తో సహజీవనం: ఆసీస్ ఛాంపియన్ ఆకస్మిక మృతి

Australia champion javelin thrower Bannister passes away

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ జర్రోడ్ బన్నిస్టర్ (33) ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అథ్లెటిక్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో తన గర్ల్‌ప్రెండ్‌తో కలిసి ఉంటున్న జర్రోడ్ సడన్‌గా మృతి చెందాడని, ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు అథ్లెటిక్స్ ఆస్ట్రేలియా వివరించింది.

అతడి మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని స్థానిక అధికారులు తమకు చెప్పినట్లు ఆస్ట్రేలియా అథ్లెటిక్స్ అసోసియేషన్ వివరించింది. 2008లో బ్రిస్బేన్‌లో జరిగిన అథ్లెటిక్స్‌లో భాగంగా 89.02 మీటర్లు జావెలిన్ విసిరి జర్రోడ్ రికార్డు నెలకొల్పాడు.

ఆ తర్వాత 2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణాన్ని సాధించాడు. 18 నెలల్లో మూడుసార్లు డోపిండ్ టెస్టులకు హాజరుకాలేదన్న కారణంగా 2013లో 20 నెలలపాటు నిషేధం విధించారు. నిషేధం అనంతరం పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొని పతకాలు కూడా సాధించాడు.

బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత చివరిసారిగా బన్నిస్టర్ దక్షిణకొరియాలోని వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో మెరిశాడు. జర్రోడ్ మృతిపై వరల్డ్, ఒలింపిక్ హర్డిల్స్ ఛాంపియన్ సాలీ పియర్‌సన్ 'జర్రోడ్ మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నా. టాలెంటెడ్ ప్లేయర్‌ను కోల్పోయామంటూ' సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

తన కెరీర్‌పై దృష్టిపెట్టిన జర్రోడ్ బన్నిస్టర్ ఇటీవలే శిక్షణ కోసం యూరప్‌ వెళ్లాడు. గర్ల్‌ప్రెండ్‌తో కలిసి నెదర్లాండ్స్‌లో ఉంటున్నాడు. అయితే జర్రోడ్ బన్నిస్టర్ ఈ క్రమంలో అకస్మాత్తుగా మృతిచెందడం ఆస్ట్రేలియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ కమ్యూనిటీని ఎంతో బాధించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 9, 2018, 18:40 [IST]
Other articles published on Feb 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+