అడిలైడ్ టెస్ట్ డ్రా: ఆసీస్ కు సిరీస్
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన అడిలైడ్ టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్ట్‌ల ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 269 పరుగుల వద్ద ఉండగా ఇరుజట్ల కెప్టెన్ల అంగీకారంతో ఈ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సీరీస్ మొత్తంలో 24 వికెట్లు సాధించిన బ్రెట్‌లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ తన కుటుంబ సభ్యులతో కలిసి మైదానంలో నుంచి అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 526 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. భారత జట్టులో సచిన్(153), కుంబ్లే(87), సెహ్వాగ్(63), హర్భజన్(63)లు రాణించారు. ఆస్ట్రేలియా జట్టులో జాన్సన్ నాలుగు వికెట్లు సాధించగా, బ్రెట్‌లీ మూడు వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 563 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఆ జట్టులో పాంటింగ్(140), క్లార్క్(118), హేడెన్(103)లు సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో పఠాన్, శర్మలు మూడేసి వికెట్ల సాధించగా, సెహ్వాగ్ రెండు వికెట్లు సాధించాడు. 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్(151) మాత్రమే ఒంటరిపోరు సాగించగా, మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ తక్కువ పరుగులకే వెనుతిరిగారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రెట్‌లీ, జాన్సన్‌లు రెండేసి వికెట్లు సాధించారు.
Story first published: Monday, January 28, 2008, 13:55 [IST]
Other articles published on Jan 28, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications