కారణం ఇదీ: బోల్ట్‌ని ఓడించినా బెస్ట్ అథ్లెట్ కాలేకపోయాడు
హైదరాబాద్: ఇటీవల లండన్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్‌ని ఓడించి వార్తల్లో నిలిచిన వివాదాస్పద ఛాంపియన్ అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్‌కి ఎదురుదెబ్బ తగిలింది.
ఆగస్టు మొదటి వారంలో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో గాట్లిన్ స్వర్ణం సాధించగా ఉసేన్ బోల్ట్ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ గాట్లిన్ స్వర్ణం గెలిచినా అతనికి ఈ ఏడాది బెస్ట్ అథ్లెట్ అవార్డు ఇవ్వబోమని ఐఏఏఎఫ్( ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్) తేల్చిచెప్పింది.
అంతేకాదు గాట్లిన్ పేరుని ఈ ఏడాది అవార్డ్స్ కోసం వచ్చిన నామినేషన్స్ జాబితా నుంచి తొలగించింది. అయితే జాబితా నుంచి గాట్లిన్ పేరు తొలగించడం క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే గతంలో ఈ అమెరికా అథ్లెట్ రెండు సార్లు డోపింగ్‌కి పాల్పడి నిషేధాన్ని ఎదుర్కోన్నాడు.

2015లో నిబంధనలు కఠినతరం
అంతకుముందు రెండేళ్ల క్రితం వరకు నిషేధం ఎదుర్కొన్న క్రీడాకారుల్ని సైతం నామినేషన్‌కి ఎంపిక చేసేవారు. అయితే తాజాగా ఐఏఏఎఫ్ 2015లో నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో తాజాగా గాట్లిన్ ఈ అరుదైన అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
బెస్ట్ అథ్లెట్ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు
ఇదిలా ఉంటే 2017 బెస్ట్ అథ్లెట్ జాబితాలో బ్రిటిష్‌కు చెందిన పదివేల మీటర్ల వరల్డ్ ఛాంపియన్ మో ఫరా, దక్షిణాఫ్రికా 400 మీటర్ల ఛాంపియన్ వైడీ వాన్ నిర్కేలతో పాటు మహిళల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన సల్లీ పీయర్సన్ తదితరులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
పురుషులు:
Mutaz Essa Barshim (QAT) high jump; Pawel Fajdek (POL) hammer; Mo Farah (GBR) 10,000m; Sam Kendricks (USA) pole vault; Elijah Manangoi (KEN) 1,500m; Luvo Manyonga (RSA) long jump; Omar McLeod (JAM) 110m hurdles; Christian Taylor (USA) triple jump; Wayde van Niekerk (RSA) 400m; Johannes Vetter (GER) javelin.
మహిళలు:
Almaz Ayana (ETH) 10,000m; Maria Lasitskene (RUS - competing as a neutral) high jump; Hellen Obiri (KEN) 5,000m; Sally Pearson (AUS) 100m hurdles; Sandra Perkovic (CRO) discus; Brittney Reese (USA) long jump; Caster Semenya (RSA) 800m; Ekaterini Stefanidi (GRE) pole vault; Nafissatou Thiam (BEL) heptathlon; Anita Wlodarczyk (POL) hammer.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications