న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టోక్యో నుంచి వచ్చింది..అంతలోనే సోదరి మరణవార్త: కుప్పకూలిన అథ్లెట్ ధనలక్ష్మీ

Athlete Dhanalaxmi broke down after learning that her sister had passed away

టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి అంతకుముందు ఆగస్టు 7వ తేదీన, భారత జైత్రయాత్ర ఒలింపిక్స్‌లో ముగిసింది. ఆ తర్వాత భారత ఆటగాళ్లందరూ స్వదేశానికి తిరిగి వచ్చారు. భారత క్రీడాకారులు శుభ వెంకటేశన్ మరియు ధనలక్ష్మి శేఖర్ టోక్యో నుండి తిరిగి తమిళనాడులోని తిరుచ్చిలోని వారి ఇంటికి చేరుకున్నప్పుడు, వారి చెవిలో విషాదకరమైన వార్త పడింది. ఇద్దరు ఆటగాళ్లకు తిరుచ్చిలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజల స్వాగతం పట్ల ధనలక్ష్మి సంతోషం వ్యక్తం చేస్తూ ఆదరాభిమానాలు చూపిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పింది, అయితే ఈ సమయంలో ఆమె అభిమానులతో ముచ్చటిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగానికి గురైంది.

నిజానికి, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, ధనలక్ష్మి ఆ సమయంలో చాలా ఆవేదనకు గురైంది.ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. తన సోదరి చనిపోయిందని తెలుసుకున్న ధనలక్ష్మి, తనను తాను నియంత్రించుకోలేక తీవ్ర ఆవేదనకు గురైంది. ధనలక్ష్మి టోక్యోలో ఉన్నప్పుడు, ఆమె సోదరి మరణించింది. కానీ ధనలక్ష్మి తల్లి కూతురికి తెలియజేయకూడదని నిర్ణయించుకుంది, ధనలక్ష్మి దృష్టి అంతా ఆటలో పూర్తిగా ఉండాలని మరియు ఆమె మెరుగైన ప్రదర్శన చేయాలని తల్లి కోరుకుంది.

ధనలక్ష్మి తమిళనాడులోని అత్యంత ప్రతిభావంతులైన అథ్లెటిక్స్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఒలింపిక్స్ లాంటి పెద్ద ఈవెంట్‌లో మంచి ప్రదర్శన కనబర్చేందుకు క్రీడాకారులు ఒత్తిడికి గురికాకూడదు.ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు తన సోదరి మరణించిందన్న వార్తను ఆమెకు తెలియపరచలేదు.

కానీ ధనలక్ష్మి ఇంటికి చేరుకున్న తర్వాత తన సోదరి మరణ వార్త విని మోకాళ్లపై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సోదరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆవేదన చెందింది. సంతోషంగా ఇంటికి చేరుకున్న ధనలక్షీకి సోదరి ఇక ఎప్పటికీ తిరిగిరాదన్న వార్తను జీర్ణించుకోలేకపోయింది. కుటుంబ సభ్యులు ధనలక్ష్మిని ఎలాగోలా ఓదార్చారు. అంతకుముందు, టోక్యో ఒలింపిక్స్‌లో తన అనుభవం గురించి ధనలక్ష్మి మాట్లాడుతూ, అక్కడ పోటీ చాలా కఠినంగా ఉండేదని, ఈ సారి నిరాశపర్చినందుకు క్షమించాలని తరువాత పోటీల్లో దేశం గర్వపడేలా పతకాన్ని సాధిస్తానని చెప్పింది. ధనలక్ష్మికి తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధనలక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఓవరాల్‌గా చూస్తే భారత్ 7 పతకాలతో టోక్యో ఒలింపిక్స్ జైత్రయాత్రను ముగించింది. ఒక స్వర్ణ పతకం, రెండు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు భారత్ సాధించింది. ఒలింపిక్ క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం సోమవారం సత్కరించింది. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పతక విజేతలకు భారీ నజరానా ప్రకటించాయి.

Story first published: Monday, August 9, 2021, 22:26 [IST]
Other articles published on Aug 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X