ఆసియా పారా గేమ్స్: భారత్‌కు స్వర్ణం తెచ్చిపెట్టిన ఏక్తా భ్యాన్

న్యూఢిల్లీ: గతంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి స్వర్ణ పతకం సాధించిన ఏక్తా భ్యాన్ మరోసారి స్వర్ణాన్ని దక్కించుకుంది. త్రోయింగ్ అథ్టెట్ అయినా ఏక్తా 16.02మీట్లరు దూరం విసిరి తొలి స్థానంతో పోటీని ముగించింది. ఆసియా పారా గేమ్స్‌లో భాగంగా జరుగుతున్న ఈవెంట్లో భారత్‌కు 22వ పతకం. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఆరు వెండి కాగా మిగిలిన 12కాంస్య పతకాలు. పతకాలు పట్టికలో ప్రస్తుతం భారత్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి:
ఏక్తా భ్యాన్ జీవితం ధైర్యం మరియు విశ్వాసంతో కూడుకున్నది. 2003లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె వెన్నుముకకు తీవ్ర గాయాలు అవడంతో పక్షవాతం కారణంగా శరీరం కింది భాగం పూర్తిగా స్పర్శను కోల్పోయింది. దీంతో వీల్ ఛైర్‌కే పరిమితమైంది. ఢిల్లీలోని ఇండియన్ స్ఫైనల్ ఇంజురీ సెంటర్‌లో చికిత్స తీసుకున్న అనంతరం ఏక్తా భ్యాన్ జీవితమే పూర్తిగా మారిపోయింది.

సర్వీసెస్ పరీక్షకు హాజరై తొలి రౌండ్‌లోనే
తల్లితండ్రులు ఇచ్చిన మద్దతుతో ఏక్తా భ్యాన్ పూరిగా కోలుకుంది. ఏక్తా భ్యాన్ తండ్రి బల్జీత్ బ్యాన్ రిటైర్డ్ హార్టీకల్చర్ ఆఫీసర్. కష్ట సమయంలో తన కుమార్తెకు వెన్నంటే నిలిచాడు. ఈ రోడ్డు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న ఏక్తా తన చదువుని కొనసాగించింది. హిసార్‌లోని కాలేజీలో బీఎ(ఇంగ్లీష్ హానర్స్)లో చేరింది. 2009లో హర్యానా సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై తొలి రౌండ్‌లోనే అర్హత సాధించింది.

ఏక్తా జీవితంలో ఏదో తెలియని వెలితి
ఆ తర్వాత మెయిన్స్‌లో విఫలమైంది. 2011లో మళ్లీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైన తాను అనుకున్నది సాధించింది. హిసార్‌లో అసిస్టెంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత ఏక్తా జీవితంలో ఏదో తెలియని వెలితి. దీంతో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనే ఉద్దేశంతో క్రీడారంగాన్ని ఎంచుకుంది.

పంచశుక్లా వేదికగా క్లబ్ త్రోలో స్వర్ణం:
క్లబ్ త్రోలో అర్జున అవార్డు గ్రహీత అమిత్ సరోహా వద్ద శిక్షణ తీసుకుంది. 2016లో పంచశుక్లా వేదికగా జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో క్లబ్ త్రోలో స్వర్ణం, డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత బెర్లిన్ వేదికగా జరిగిన ఐపీసీ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ఫ్రీలో మహిళల క్లబ్ త్రోలో సిల్వర్ పతకం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications