
హైదరాబాద్: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అడ్వానీ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా స్నూకర్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. దీంతో అతడు స్నూకర్‌లోనూ కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేశాడు. గతంలోనే బిలియర్డ్స్ విభాగంలోనూ ఈ ఘనత సాధించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం జరిగిన ఫైనల్లో 34 ఏళ్ల పంకజ్ 6-3 తేడాతో థనావత్ తిరపోంగ్‌పైబూన్‌ను (థాయ్‌లాండ్) ఓడించాడు. ఫలితంగా క్యూ స్పోర్ట్స్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకున్నాడు. 18 ఏళ్ల వయస్సులోనే పంకజ్ స్నూకర్, బిలియర్డ్స్ విభాగాల్లో ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పాటు సిక్స్ రెడ్, 15 రెడ్ (లాంగ్ ఫార్మాట్) టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
తాజా విజయంతో రెండు విభాగాల్లో గ్రాండ్‌స్లామ్ కొట్టిన తొలి ఆటగానిగా అద్వానీ నిలిచాడు. ఆసియా స్నూకర్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలవడంపై పంకజ్ అద్వానీ మాట్లాడుతూ "దేశం తరఫున స్నూకర్, బిలియర్డ్స్ విభాగాల్లో అ న్ని టైటిళ్లను అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ విజయంతో నా ట్రోఫీ క్యాబినెట్ సంపూర్ణమైంది" అని అన్నాడు.