Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా క్రీడలంటే ముందుండేది థాయ్‌లాండ్‌యే..!

Asian Games - Thailand teams look to continue sepaktakraw dominance

హైదరాబాద్: ఆసియా క్రీడలంటే థాయ్‌లాండ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఆసియా దేశాల్లో మరేదేశం చేయలేని రికార్డును థాయ్‌లాండ్ మాత్రమే చేయగలిగింది. విస్తీర్ణంలో, జనాభాలో పెద్దవైన చైనా, భారత్, ఇండోనేషియా కంటే, ఆర్థిక ప్రగతిలో ముందున్న జపాన్, దక్షిణ కొరియా సైతం ఇన్నిసార్లు నిర్వహించ లేకపోవడం గమనార్హం. భారత్‌లోనే (1951) ప్రారంభమైన ఈ క్రీడలకు మనం ఆతిథ్యం ఇచ్చింది మాత్రం రెండుసార్లే. చివరిగా 1982లో రెండోసారీ ఢిల్లీలోనే జరిగాయి.

కొరియా 3... చైనా, జపాన్‌ 2:

కొరియా 3... చైనా, జపాన్‌ 2:

1970లో భద్రతా కారణాలతో వీలుకాదన్న దక్షిణ కొరియా 1986, 2002, 2014లో టోర్నీని నిర్వహించింది. థాయ్‌లాండ్‌ తర్వాత ఎక్కువ సార్లు వేదికగా నిలిచింది. అయితే, చాలా ఆలస్యంగా 1974లో ఆసియాడ్‌లో అడుగిడిన చైనా తర్వాత పదహారేళ్లకే ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత 2010లో మరోసారి పోటీలు ఇక్కడే నిర్వహించింది. జపాన్‌ 1958లోనే తమ దగ్గర టోర్నీని నిర్వహించింది. మళ్లీ 1994లో... అణుబాంబు బాధిత హిరోషిమాలో ఆడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. దేశ రాజధానిలో కాకుండా వేరే నగరంలో ఆసియాడ్‌ జరగడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.

తొలి సారి రెండు నగరాల్లో ఆసియన్ గేమ్స్:

తొలి సారి రెండు నగరాల్లో ఆసియన్ గేమ్స్:

ఈ జాబితాలో బుసాన్‌ (2002), గాంగ్జు (2010), ఇంచియాన్‌ (2014) తర్వాత చేరాయి. ఇరాన్, ఖతార్, ఫిలిప్పీన్స్‌లలో ఒక్కోసారి ఆసియాడ్‌ జరగ్గా... ప్రస్తుతం ఇండోనేసియా రెండోసారి వేదిక కానుంది. రెండు (జకార్తా, పాలెంబాంగ్‌) నగరాల్లో జరుగనుండటం మాత్రం ఇప్పుడే కావడం గమనార్హం.

4 సార్లు నిర్వహించడానికి గల కారణం:

4 సార్లు నిర్వహించడానికి గల కారణం:

చర్రితలో ఏ మెగా టోర్నీని ఒకే దేశం వరుసగా రెండుసార్లు నిర్వహించలేదు. థాయ్‌లాండ్‌ మాత్రం ఆసియాడ్‌తో ఆ ఘనత సాధించింది. అంతేకాదు, 1966-78 మధ్య ఏకంగా మూడుసార్లు ఆతిథ్యం ఇచ్చి రికార్డుల్లోకి ఎక్కింది. ఇతర దేశాలు తమవల్ల కాదని చేతులెత్తేసిన సందర్భాల్లో థాయ్‌లాండ్‌ ముందుకు రావడమే ఇందుకు కారణం. 1966లో తొలిసారిగా, 1970లో దక్షిణ కొరియా నిస్సహాయతతో, 1978లో పాకిస్తాన్‌ తప్పుకోవడంతో థాయ్‌లాండ్‌ వేదికగా మారింది. 1998లో సొంత బిడ్‌తో పోటీలు నిర్వహించింది.

పతకాల విశేషాలు.. పోటీలకు వచ్చిన దేశాలు:

పతకాల విశేషాలు.. పోటీలకు వచ్చిన దేశాలు:

జపాన్, భారత్‌ మాత్రమే ప్రతి ఆసియాడ్‌లోనూ బంగారు పతకాలను గెల్చుకున్నాయి. ఇదిలా ఉంటే భూటాన్, మాల్దీవులు, తైమూర్‌ మాత్రమే టోర్నీలో ఇప్పటివరకు ఒక్క పతకమూ గెలవని దేశాలుగా నమోదైయ్యాయి. మిగిలిన 37 దేశాలు కనీసం కనీసం ఒక్క బంగారు పతకాన్నైనా సాధించాయి. కొద్ది పాటి కారణాలతో అన్ని దేశాలు పాల్గొనలేకపోయినప్పటికీ అన్ని ఆసియాడ్‌లలో మాత్రం ఈ ఏడు దేశాలు భారత్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, జపాన్, శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్‌ పాల్గొంటూనే వస్తున్నాయి.

పతకాల పట్టికలో ఆ రెండే... :

పతకాల పట్టికలో ఆ రెండే... :

ఆసియాడ్‌ పతకాల పట్టికలో 1978 నుంచి ఇప్పటి వరకు జపాన్, తర్వాత నుంచి చైనాలదే అగ్రస్థానం. వీటిని దాటి ఏ దేశమూ నిలవలేకపోయింది. ఇప్పటివరకు చైనా ఏకంగా 1,342 స్వర్ణాలు గెల్చుకుని తన ఆధిపత్యం చాటింది. 957 స్వర్ణాలతో జపాన్‌ దాని వెనుక ఉంది. ఈ జాబితాలో భారత్‌ (139)... దక్షిణ కొరియా (696), ఇరాన్‌ (159), కజకిస్తాన్‌ (140) తర్వాత ఉంది.

Story first published: Friday, August 10, 2018, 17:01 [IST]
Other articles published on Aug 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+