For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్క్వాష్: దీపిక పల్లికల్‌కు కాంస్యం, భారత్‌కు జరిమానా

By Nageswara Rao

న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో సోమవారం స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్‌కు కాంస్యం అందించింది. దీపికా మహిళల సింగిల్స్ విభాగంలో సెమీ పైనల్స్‌లో మలేషియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ నికోల్ డేవిడ్ చేతిలో ఓడింది. 25 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 12 అయిన దీపిక పల్లికల్ 11-4, 11-4, 11-5 తేడాతో నికోల్‌పై ఓడిపోయింది. ఆసియా గేమ్స్‌లో మహిళల స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో ఇదే తొలి పతకం.

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 25 మీటర్ల మహిళల పిస్టల్ టీమ్ విభాగంలో కాంస్య పతకం దక్కింది. టీమ్ ఈవెంట్‌లో హీనా, స్నోబర్, అనీసాలు పతకం సాధించారు. ఇక బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకం సాధించింది. సెమీ ఫైనల్స్ వరకు వెళ్లిన భారత్ ఓటమి పాలవ్వడంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక ఆసియా గేమ్స్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. 62 కేజీల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఉత్తర కొరియా క్రీడాకారుడు అత్యధిక బరువునెత్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 62 కేజీల విభాగంలో 154 కేజీల బరువునెత్తిన కిమ్ వున్ గుక్, ఆ విభాగంలో ప్రపంచంలోనే అత్యధిక బరువునెత్తిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో 153 కేజీల బరువునెత్తిన టర్కీ క్రీడాకారుడు షి ఝి యంగ్ పేరిట ప్రపంచ రికార్డు ఉంది. కిమ్ వున్ గుక్ 154 కేజీల బరువునెత్తి ఆ రికార్డును అధిగమించాడు.

Asian Games: North Korean Olympic champion breaks weightlifting world record

ఆసియా గేమ్స్ నిర్వాహణ కమిటీ భారత్‌కు జరిమానా విధించింది. చివరి క్షణాల్లో కొంత మంది ఆటగాళ్లు వైదొలగినందుకు భారత్ 10,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆసియా ఒలింపిక్ మండలి (ఒసిఎ) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ నిర్ణయాన్ని కమిటీ వెనక్కు తీసుకుంటుందని భారత్ నమ్మకం వ్యక్తం చేసింది. కాగా, జరిమానా ఎంతనే వివరం ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

ముందుగా ప్రకటించిన జాబితా నుంచి కొంత మంది పోటీలు ప్రారంభానికి ముందు కొంత మంది ఆటగాళ్లు వైదొలగడంతో ఈ సమస్య తలెత్తింది. టెన్నిస్‌లో భారత టాప్ సింగిల్స్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, లియాండర్ పేస్ తాము ఎటిపి టూర్ పాయింట్లపై దృష్టి కేంద్రీకరించామని, అందుకే ఆసియా క్రీడల్లో పాల్గొనబోమని ప్రకటించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+