Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓపెన్ టాప్ జీబులో: డప్పులు వాయిస్తూ హిమదాస్‌కి ఘన స్వాగతం

Asian Games medalist Hima Das gets grand welcome at Guwahati

హైదరాబాద్: ఆసియా గేమ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు గెలిచిన స్ప్రింటర్ హిమ దాస్‌కు సొంత రాష్ట్రం అసోంలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. అసోం ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్‌తో పాటు మంత్రి వర్గ సహచరులు ఎల్‌పీజీబీ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు.

హిమదాస్‌ను అభిమానందించిన అభిమానులు

హిమదాస్‌ను అభిమానందించిన అభిమానులు

హిమ తల్లిదండ్రులు, వేలాదిగా అభిమానులు కూడా అక్కడి చేరుకుని స్ప్రింటర్‌ని అభినందించారు. ఎయిర్‌పోర్టులో తమ అభిమాన అథ్లెట్‌కు ఎర్ర తివాచీ వేసి దానిపై స్టార్ట్‌ 1,2,3,4,5,6 అన్న సంఖ్యలతో ట్రాక్‌ను రూపొందించారు. ఈ ట్రాక్‌ రీతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ హిమ బయటకు వచ్చింది.

హిమదాస్ ఊరేగింపు

హిమదాస్ ఊరేగింపు

మరోవైపు తన తల్లిదండ్రులు రంజీత్, జోనాలీదాస్ వెంట రాగా కారులో 25 మంది ప్రత్యేక మహిళా భద్రతా సిబ్బంది మధ్య హిమదాస్ ఊరేగింపు జరిగింది. హిమదాస్ స్వస్థలం ధింగ్‌ నుంచి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తును అరుస్తూ డ్రమ్ములు వాయిస్తూ సంప్రదాయ నృత్రాలు చేశారు.

శ్రీమంత శంకరదేవ్‌ కళాక్షేత్రంలో సన్మానం

శ్రీమంత శంకరదేవ్‌ కళాక్షేత్రంలో సన్మానం

అనంతరం హిమదాస్‌‌ను శ్రీమంత శంకరదేవ్‌ కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఆసియా గేమ్స్‌లో 400 మీటర్ల మహిళల ఈవెంట్‌లో పోటీపడిన హిమదాస్ ఫైనల్లో 50.79 సెకన్లతో రేసుని ముగించి రజత పతకాన్ని గెలుపొందింది. నేషనల్ రికార్డు టైమ్ 50.79 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె.. రెండోస్థానంలో నిలిచింది.

తొలి ఇండియన్‌ అథ్లెట్‌గా హిమ దాస్ రికార్డు

తొలి ఇండియన్‌ అథ్లెట్‌గా హిమ దాస్ రికార్డు

51 సెకన్లలోపు 400 మీటర్ల రేసు పూర్తి చేసిన తొలి ఇండియన్‌ అథ్లెట్‌గా హిమ దాస్ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత మిక్సెడ్‌ 4x400 మీటర్ల రిలేలోనూ ఈ స్ప్రింటర్ పోటీపడగా.. టీమ్ రజతం గెలుపొందింది. చివర్లో మహిళల 4x400 మీటర్ల రిలేలోనూ హిమ దాస్ భాగస్వామిగా ఉన్న టీమ్ బంగారు పతకాన్ని గెలుపొందింది. ఇలా భారత్‌కి మూడు పతకాలు అందించడంలో హిమ దాస్‌ కీలకంగా వ్యవహరించింది.

Story first published: Saturday, September 8, 2018, 9:24 [IST]
Other articles published on Sep 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+