ఆర్చరీ, స్క్వాష్‌లో స్వర్ణాలు, ఈతలో రజతం..(పిక్చర్స్)
ఇంచియాన్: ఆసియా క్రీడల ఆర్చరీ విభాగంలో శనివారం భారత్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. ఆర్చరీ విభాగంలో తొలిసారిగా భారత్ స్వర్ణ పతకం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్‌లో దక్షిణ కొరియాపై 227-225 పాయింట్ల తేడాతో భారత బృందం (రజత్ చౌహాన్, సందీప్ కుమార్, అభిషేక్ వర్మ) విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇది ఇలా ఉండగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ(విజయవాడ), త్రిష డే, పూర్వా, షిండే ఆర్చరీ జట్టు కాంస్యం సాధించింది.
శనివారం ఆసియా క్రీడల్లో మరో స్వర్ణం లభించింది. పురుషుల స్క్వాష్ టీమ్ ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో మలేషియాను 2-0తో భారతజట్టు ఓడించింది. హరీందర్, సౌరవ్ ఘోషల్ అద్భుత ఆటతీరుతో భారత్‌కు బంగారు పతకాన్ని సాధించిపెట్టారు. 50మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో భారత్‌కు చైన్ సింగ్ రజత పతకాన్ని అందించాడు.
కాగా, శుక్రవారం భారత్ మరో రెండు పతకాలను సాధించింది. షూటింగ్‌లో రజత పతకం లభించగా, స్విమ్మింగ్‌లో కొనసాగుతున్న ఫ్లాప్ షోకు తెరదించుతూ సందీప్ సెజ్వాల్ కాంస్య పతకం సాధించాడు. లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న విజయ్ కుమార్‌తోపాటు పెంబా తమాంగ్, గుర్‌ప్రీత్ సింగ్ సభ్యులుగా ఉన్న భారత పురుషుల జట్టు 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో 1,740 పాయింట్లు సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా స్వర్ణ పతకాన్ని అందుకోగా, దక్షిణ కొరియాకు కాంస్య పతకం లభించింది.
పురుషుల స్విమ్మింగ్ 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో సందీప్ సెజ్వాల్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, నాలుగేళ్ల క్రితం ఆసియా క్రీడల్లో విర్ధావల్ ఖాడే ఈత కొలనులో ఒక పతకాన్ని అందుకోగా, ఈసారి సెజ్వాల్ పతకాన్ని అందించాడు. గాంగ్జూ ఏషియాడ్‌లో విర్ధావల్‌కు 50 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో కాంస్య పతకం లభించింది. అతను లక్ష్యాన్ని 28.25 సెకన్లలో చేరుకోగా, కజకస్థాన్ స్విమ్మర్ దిమిత్రీ బలాండిన్ 27.78 సెకన్లతో కొత్త మీట్ రికార్డును సృష్టించాడు. గతంలో ఉన్న 27.80 సెకన్ల రికార్డును అతను అధిగమించాడు.
జపాన్‌కు చెందిన యసుహిరో కొసెకీ 27.89 సెకన్లతో రజత పతకాన్ని గెల్చుకున్నాడు. కాగా షూటింగ్, స్విమ్మింగ్ విభాగాల్లో లభించిన పతకాలతో భారత్ పతకాల సంఖ్య 17కు పెరిగింది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతం, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్‌లో భారత్ ఎనిమిదో పతకాన్ని గెల్చుకుంది. మొత్తం మీద ఈ క్రీడాంశంలో శుక్రవారం నాటికి భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్య పతకాలు దక్కాయి. వీటిలో రెండు మాత్రమే ఇండివిజువల్ ఈవెంట్స్‌లో లభించగా, మిగతావన్నీ టీం ఈవెంట్స్‌లో దక్కినవే కావడం గమనార్హం.

ఆసియన్ గేమ్స్
ఆసియా క్రీడల ఆర్చరీ విభాగంలో శనివారం భారత్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. ఆర్చరీ విభాగంలో తొలిసారిగా భారత్ స్వర్ణ పతకం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్‌లో దక్షిణ కొరియాపై 227-225 పాయింట్ల తేడాతో భారత బృందం (రజత్ చౌహాన్, సందీప్ కుమార్, అభిషేక్ వర్మ) విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది.

ఆసియన్ గేమ్స్
ఇది ఇలా ఉండగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ(విజయవాడ), త్రిష డే, పూర్వా, షిండే ఆర్చరీ జట్టు కాంస్యం సాధించింది.

ఆసియన్ గేమ్స్
శుక్రవారం భారత్ మరో రెండు పతకాలను సాధించింది. షూటింగ్‌లో రజత పతకం లభించగా, స్విమ్మింగ్‌లో కొనసాగుతున్న ఫ్లాప్ షోకు తెరదించుతూ సందీప్ సెజ్వాల్ కాంస్య పతకం సాధించాడు.

ఆసియన్ గేమ్స్
24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, నాలుగేళ్ల క్రితం ఆసియా క్రీడల్లో విర్ధావల్ ఖాడే ఈత కొలనులో ఒక పతకాన్ని అందుకోగా, ఈసారి సెజ్వాల్ పతకాన్ని అందించాడు.

ఆసియన్ గేమ్స్
గాంగ్జూ ఏషియాడ్‌లో విర్ధావల్‌కు 50 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో కాంస్య పతకం లభించింది.

ఆసియన్ గేమ్స్
మొత్తం మీద ఈ క్రీడాంశంలో శుక్రవారం నాటికి భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్య పతకాలు దక్కాయి.
ఇండివిజువల్ విభాగాల్లో జీతు రాయ్, అభినవ్ బింద్రా మాత్రమే పతకాలు సాధించారంటే షూటింగ్‌లో పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్క్వాష్‌లో ఒక రజతం, ఒక కాం స్యంతో 2, రోయింగ్‌లో 3 కాంస్యాలు, ఉషులో 2 కాంస్యాలు, బాడ్మింటన్‌లో ఒక కాంస్య పతకం భారత్ ఖాతాలో ఉన్నాయి. చైనా 88 స్వర్ణాలు, 47 రజతాలు, 37 కాంస్యాలతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, దక్షిణ కొరియా 31 స్వర్ణాలు, 37 రజతాలు, మరో 35 కాంస్యాలతో ద్వితీయ స్థానంలో ఉంది. 29 స్వర్ణాలు, 29 రజతాలు, 34 కాంస్యాలను సాధించిన జపాన్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
మహిళల 50 మీటర్ల రైఫిల్-3 పొజిషన్స్ టీం ఫైనల్స్‌లో భారత జట్టు గురి తప్పింది. 44 ఏళ్ల అంజలి భగవత్, తేజశ్విని మూలే సభ్యులుగా ఉన్న భారత్‌కు ఆరో స్థానం లభించింది. 50 మీటర్ల రిఫైల్-3 పొజిషన్స్‌లో లజ్జా కుమారి గోస్వామి ఆరో స్థానంతో సంతృప్తి చెందింది. అంజలికి 25, తేజశ్వినికి 29వ స్థానం దక్కారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications