స్క్వాష్: సౌరభ్‌కు వెండి పతకం, రికార్డు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో వుషు ఆటలో సనతోయి దేవి కాంస్యం సాధించింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఈ మణిపూర్ క్రీడా కారిణి జాంగ్ లూయిన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. సోమవారం నాడు మహిళల సాండా 52 కేజీల క్వార్టర్ ఫైనల్స్ సనతోయి దేవి అధ్బుత ప్రదర్శన చేసి సెమీ ఫైనల్‌కు చేరింది.
ఆసియా గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్యం పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 10 మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్‌లో అభినవ్ బింద్రా, రవి కుమార్, సంజీవ్ రాజ్‌పుత్ జట్టు పతకాన్ని సాధించింది.
ఆసియా గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ ఆటగాడు సౌరభ్ ఘోషాల్ వెండి పతకం గెలుచుకున్నాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో కువైట్ ఆటగాడు అబ్దుల్లా అల్మీజయేన్ చేతిలో 3-2, (12-10, 11-2, 12-14, 8-1, 9-11)తో ఓడిపోయి వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు.
సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ పైనల్లో ప్రపంచ 16వ ర్యాంకరైన సౌరభ్ 11-9, 11-4, 11-5తో ప్రపంచ 35వ ఆటగాడు బెంగ్ హీ (మలేషియా)పై గెలిచి రికార్డు సృష్టించాడు.
ఇది ఇలా ఉంటే ఆసియా గేమ్స్‌లో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత క్రీడాకారులకు కఠినమైన డ్రా పడింది. దీంతో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్ చేరితే.. అక్కడ చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌తో పోటీ పడాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ యిహాన్‌తో తొమ్మిద మ్యాచ్ లాడిన సైనా ఒక్కసారి మాత్రమే నెగ్గింది.
అది కూడా ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకుంది. మరో స్టార్ క్రీడాకారిణి పివి. సింధు క్వార్టర్స్ వరకూ బాగానే రాణించింది. ఐతే ఇక నుంచే ఉంది అసలదంతా. సెమీ ఫైనల్స్‌లో ఒలింపిక్ ఛాంపియన్ లిజురుయ్‌ను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
స్కాష్‌లో పురుషుల సింగిల్స్‌లో కాంస్యం సాధించిన సౌరవ్, మహిళల సింగిల్స్‌లో కాంస్యంతో మెరిసి పళ్లికల్ ఈ రికార్డు సాధించిన తొలి భారత క్రీడాకారులుగా నిలిచారు. ఇక మహిళల షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు మరో కాంస్యం దక్కింది. వుషు క్రీడలోనూ ఇద్దరు సెమీస్ చేరడంతో రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఇలా మూడో రోజు రెండు కాంస్యాలను నెగ్గిన భారత్ టోర్నీలో తన పతకాల సంఖ్యను ఆరుకు పెంచుకుంది.

సౌరభ్‌కు వెండి పతకం, రికార్డు
ఆసియా గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ ఆటగాడు సౌరభ్ ఘోషాల్ వెండి పతకం గెలుచుకున్నాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో కువైట్ ఆటగాడు అబ్దుల్లా అల్మీజయేన్ చేతిలో 3-2, (12-10, 11-2, 12-14, 8-1, 9-11)తో ఓడిపోయి వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు.

సౌరభ్‌కు వెండి పతకం, రికార్డు
సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ పైనల్లో ప్రపంచ 16వ ర్యాంకరైన సౌరభ్ 11-9, 11-4, 11-5తో ప్రపంచ 35వ ఆటగాడు బెంగ్ హీ (మలేషియా)పై గెలిచి రికార్డు సృష్టించాడు.

ఆసియా గేమ్స్: ఇంచియాన్‌లో ఈరోజు
దక్షణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఉమెన్స్ బ్యాడ్మింటన్ జట్టు.

ఆసియా గేమ్స్: ఇంచియాన్‌లో ఈరోజు
దక్షణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఉమెన్స్ బ్యాడ్మింటన్ జట్టు. వరుసగా సైనా నెహ్వాల్, పివి. సింధు, పిసి తులసి, అశ్విన్ పొన్నప్ప, సిక్కిరెడ్డి, ప్రద్న్య గద్రే.

ఆసియా గేమ్స్: ఇంచియాన్‌లో ఈరోజు
దక్షణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న సైనా నెహ్వాల్.

ఆసియా గేమ్స్: ఇంచియాన్‌లో ఈరోజు
దక్షణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఉమెన్స్ బ్యాడ్మింటన్ జట్టు. ఫోటోలో కోచ్ గోపీంచంద్ కూడా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications