Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2023: డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఓడించిన హాకీ టీం.. ఓడిపోయిన ఫుట్‌బాల్ టీం!

ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ టీం మరో ఘనవిజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన జపాన్‌పై సూపర్ విక్టరీ సాధించింది. పూల్-ఏలో భాగంగా ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచులో జపాన్‌ను 4-2 తేడాతో భారత పురుషుల హాకీ టీం చిత్తుచేసింది. 2018 ఆసియా గేమ్స్‌లో జపాన్ హాకీ టీం గోల్డ్ మెడల్ సాధించి, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన సంగతి తెలిసిందే.

భారత టీంలో అభిషేన్ రెండు గోల్స్ చేయగా.. మన్‌దీప్ సింగ్, అమిత్ రోహిదాస్ చెరో గోల్ చేశారు. జపాన్ టీంలో గెంకి మిటానీ, ర్యోసేయ్ కాటో చెరో గోల్ చేశారు. మిగతా ప్లేయర్లకు గోల్స్ చేసే అవకాశం కూడా ఇవ్వని భారత్ ఈ మ్యాచులో ఘన విజయం సాధించింది. దీంతో భారత టీం కాన్ఫిడెన్స్ రెండితలు అవుతుంతని నిపుణులు అంటున్నారు.

 Asian Games 2023 Indian Men Hockey Team defeated defending Champion Japan

ఇక భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు ఈ ఆసియా క్రీడల్లో చేదు ఫలితం ఎదురైంది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియాతో భారత్ తలపడింది. ఈ జాబితాలో భారత్ 102వ స్థానంలో ఉంది. ఈ మ్యాచులో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో తొలి హాఫ్‌లో ఎవరూ గోల్స్ చేయలేకపోయారు.

అయితే సెకండ్ హాఫ్‌లో సౌదీ టీం మరింత దూకుడుగా ఆడింది. కేవలం ఆరు నిమిషాల తేడాతో రెండు గోల్స్ చేసింది. దీంతో వెనుకబడ్డ భారత జట్టు పుంజుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. దీంతో 0-2 తేడాతో ఓడిన భారత జట్టు ఆసియా క్రీడల నుంచి తప్పుకుంది.

ఇక మిగతా క్రీడల విషయానికొస్తే.. కామన్‌వెల్త్ క్రీడల్లో మెడల్ సాధించిన భారత బాక్సర్ జాస్మీన్ లంబోరియా ఈ పోటీల్లో ముందంజ వేసింది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆమె 60 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్‌లో సౌదీ ప్లేయర్‌ను ఓడించింది. మరొక్క విజయం సాధిస్తే జాస్మీన్‌కు మెడల్ ఖాయం అవుతుంది.

పురుషుల డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ ప్లేయర్లు రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేనీ అద్భుతంగా సత్తా చాటారు. సెమీఫైనల్‌లో కొరియా జోడీని 6-1, 6-7 (6), 10-0 తేడాతో ఓడించిన వీళ్లు ఫైనల్ చేరుకున్నారు. అలాగే తాము ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు క్లీన్‌స్వీప్‌లు నమోదు చేసిన భారత పురుషుల స్క్వాష్ బృందం కూడా సెమీస్ చేరుకుంది. దీంతో ఈ టీంకు కనీసం కాంస్య పతకం ఖరారైంది.

అలాగే టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, రుతుజా భోసాలే జోడీ కూడా సెమీస్‌లో అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో కజకస్తాన్ జోడీపై 7-5, 6-3 తేడాతో విజయం సాధించిన ఈ జంట సెమీస్ చేరింది. దీంతో ఈ జోడీకి కూడా కనీసం కాంస్యం ఖాయమైంది. పురుషుల 51 కేజీల బాక్సింగ్‌లో భారత బాక్సర్ దీపక్ బోరియా ఓటమిపాలయ్యాడు. రౌండ్ ఆఫ్ 16లో జపాన్ ప్లేయర్ చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టాడు.

Story first published: Thursday, September 28, 2023, 22:25 [IST]
Other articles published on Sep 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+