Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2023: మెడల్ రాలేదని స్వప్న షాకింగ్ కామెంట్స్.. తోటి అథ్లెట్ ను అలా అంటారా?

భారతీయ అథ్లెట్ స్వప్న బర్మ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు మెడల్ రాలేదనే కోపంతో తోటి అథ్లెట్ నందిని అగసరపై మండిపడింది. వ్యక్తిగతమైన దూషణలకు దిగింది. హైపథ్లాన్ పోటీల్లో ఓడిపోయిన ఆమె.. ఈ పోటీల్లో గెలిచిన నందిని ఒక ట్రాన్స్‌జెండర్ అంటూ ఆరోపణలు చేసింది. తాను ఒక ట్రాన్స్‌జెండర్ చేతిలో ఓడిపోయాను అన్నది.

ఆదివారం నాడు ఏషియన్ గేమ్స్ లో హెప్తథ్లాన్ పోటీకు జరిగాయి. ఇందులో స్వప్న బర్మ 57.08 పాయింట్లు సాధించగా.. నందిని అగసర 57.12 పాయింట్లు సాధించి రజత పతకం గెలుచుకుంది. ఈ పోటీల్లో స్వప్న నాలుగో స్థానంలో నిలిచింది. ఆమె లేకపోతే తను మూడో స్థానంలో కాంస్యం సాధించే అవకాశం ఉండేదని, కానీ ఇలా ఒక ట్రాన్స్‌జెండర్ వల్ల పతకం మిస్ అయ్యానని స్వప్న అంటోంది.

Asian Games 2023 Indian athlete swapna shocking comments on nandini

ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె.. ఓ ట్రాన్స్‌జెండర్ చేతిలో తాను రేస్‌ ఓడిపోయానంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు చేసింది. అయితే స్వప్న తన ట్వీట్‌లో నేరుగా నందిని పేరు చెప్పలేదు. కానీ నందిని చేతిలో తాను ఓడిపోయిన తర్వాత ఈ ట్వీట్ చేయడంతో ఆమె ఈ పోస్ట్ లో నందినినే టార్గెట్ చేసిందని అంతా అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ట్విటర్ వేదికగా వివాదాస్పద పోస్ట్ చేసిన కొద్ది సేపటికే స్వప్న ఆ పోస్ట్‌ను తొలగించేసింది. కానీ ఈ పోస్ట్ అప్పటికే వైరల్ అయిపోయింది. నిజానికి అథ్లెటిక్స్ నియమావళికి ప్రకారం, ఇలా ఎవరిపైనా నేరుగా విమర్శించడం, ఆరోపణలు చేయడం తగదు. అయితే స్వప్న తన పోస్ట్‌తో ఆ రూల్‌ని అతిక్రమించింది. మరిప్పుడు ఆమెపై అథ్లెటిక్ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఆ తర్వాత ఆమె మరోసారి నందినిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తను ఇలా కంప్లయింట్ చేయడంతో నందిని భయపడిందని, తల్లికా బాగలేదని అబద్ధం చెప్పి ఆసియా గేమ్స్ విలేజ్ నుంచి వెళ్లిపోయిందని చెప్పింది. తామందరం అక్టోబర్ 6న భారత్‌కు రిటర్న్ అవ్వాల్సి ఉందని, కానీ ఆమె ఇప్పుడే రిటర్న్ అయిపోతుంటే అసలు టికెట్స్ ఎవరు కొనిచ్చారని ప్రశ్నించింది. ఆమె జెండర్ గురించి టెస్టింగ్ ఉంటుందని భయపడే నందిని పారిపోయిందని ఆరోపించింది.

Story first published: Monday, October 2, 2023, 13:00 [IST]
Other articles published on Oct 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+