Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో హైడ్రామా.. చివరకు సిల్వర్ మెడల్‌తో మెరిసిన తెలుగు తేజం!

ఆసియా క్రీడల్లో తెలుగు తెజం జ్యోతి యర్రాజీ మెడల్‌తో మెరిసింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె రాణించింది. ఈ రేసు మొదట్లో చైనాకు చెందిన వు యాన్నీ.. రేస్ మొదలవడానికి క్షణం ముందే పరుగు ప్రారంభించింది. ఆ సమయంలో యాన్నీ.. జ్యోతికి ఎడంవైపునే ఉంది. ఆమె పరిగెత్తడం మొదలు పెట్టగానే జ్యోతి కూడా పరుగు మొదలు పెట్టింది.

దీన్ని 'ఫాల్స్ స్టార్ట్'గా గుర్తించిన న్యాయనిర్ణేతలు.. వీళ్లిద్దర్నీ రేసు నుంచి తప్పించాలని అనుకున్నారు. అయితే దీనికి జ్యోతి ససేమిరా అంది. నిర్వాహకులతో చాలాసేపు ఈ విషయంపై చర్చించింది. సుదీర్ఘ చర్చల తర్వాత.. జ్యోతి, వు ఇద్దరి వీడియోను సమీక్షించాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే ఆ లోపు ఇద్దర్నీ రేసులో పాల్గొనేందుకు అనుమతించారు. అయితే ఈ ఘటన వల్ల జ్యోతి స్టార్ట్ కొంచెం తడబడింది.

Asian Games 2023 Indian athlete Jyothi Yarraji shines with Silver

ఈ కారణంగా ఆమె సాధారణం కంటే స్లోగా రేస్ మొదలు పెట్టింది. అయితే రేస్ మధ్యలో ఈ ఆలస్యాన్ని కవర్ చేసుకున్న ఆమె 12.91 సెకండ్లలో రేస్ పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఆమెకు రజతం పతకం దక్కుతుందని అంతా అనుకున్నారు. ఈ రేసు పూర్తయిన తర్వా కూడా వీరి 'ఫాల్స్ స్టార్ట్' వీడియో రివ్యూ పూర్తవలేదు. దీంతో ఫలితాలను వెంటనే ప్రకటించలేదు.

వీడియో సమీక్ష తర్వాత వుది 'ఫాల్స్ స్టార్ట్' అని తేలింది. దీంతో ఆమెపై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. టీఆర్16.8 నిబంధనల ప్రకారం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇలా వు నిష్క్రమించడంతో జ్యోతి రెండో స్థానంలో రేసు ముగించినట్లు అయింది. ఈ క్రమంలో జ్యోతి ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని భావించిన అధికారులు.. ఆమె రేసు ఫలితాన్ని గుర్తించారు. ఆమెను రజత పతకంతో సత్కరించారు.

Story first published: Sunday, October 1, 2023, 19:37 [IST]
Other articles published on Oct 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+