Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2023: 45 ఏళ్ల తర్వాత లాంగ్ జంప్ మెడల్.. రాణిస్తున్న భారత క్రీడాకారులు!

చైనాలోని హాంగ్ జో వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు రాణిస్తున్నారు. పురుషుల 15 వేల మీటర్ల రేసులో అజయ్ కుమార్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. అదే రేసులో మరో భారతీయుడు జిన్సన్ జాన్సన్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.

ఇక 45 ఏళ్ల తర్వాత భారత్‌కు లాంగ్ జంప్‌లో కూడా పతకం దక్కింది. లాంగ్ జంప్ ఫైనల్‌లో భారత ప్లేయర్ మురళీ శ్రీశంకర్ 8.19 మీటర్ల జంప్‌తో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో 45 ఏళ్ల తర్వాత లాంగ్ జంప్‌లో తొలిసారి భారత్‌కు పతకం దక్కింది. మహిళల హెపథ్లాన్‌లో భారత క్రీడాకారిణి నందిని అగసర కాంస్య పతకంతో మెరిసింది.

Asian Games 2023 India won medal in long jump after 45 years

మరో క్రీడలో భారత డిస్కస్ త్రోయర్ సీమా పూనియా కూడా రాణించింది. ఈ మ్యాచులో ఆమె 58.62 త్రో విసిరి కాంస్యం సాధించింది. ఆ తర్వాత పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ కూడా చరిత్ర సృష్టించింది. చైనాతో జరిగిన ఫైనల్ లో భారత ఆటగాళ్లు 3-2 తేడాతో ఓడారు. దీంతో భారత టీమ్ సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అలాగే 4X100 మీటర్ల మెడ్లీ రిలేలో భారత పురుష స్విమ్మర్లు ఫైనల్ కు అర్హత సాధించారు. భారత అమ్మాయిల వాలీబాల్ జట్టు కూడా రాణించింది. తమ చివరి లీగ్ మ్యాచులో చైనా చేతిలో భారత అమ్మాయిలో ఘోరంగా ఓడారు. కానీ చివరకు టాప్ 8లో నిలిచి ఫైనల్ చేరుకున్నారు. అనంతరం స్పీడ్ స్కేటింగ్ లో కూడా భారత్ రెండు పతకాలు సాధించింది.

సంజన బత్తుల, కార్తీక జగదీశ్వరన్, హీరల్ సాధు తో కూడిన అమ్మాయిల స్కేటింగ్ బృందం కాంస్యం అందుకున్నారు. అలాగే ఆర్యన్ పాల్ సింగ్, ఆనంద్ కుమార్ వెల్ కుమార్, సిద్ధాంత కంబ్లే, విక్రమ్ ఇంగాలే టీమ్ కూడా కాంస్యం సాధించింది.

Story first published: Monday, October 2, 2023, 11:10 [IST]
Other articles published on Oct 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+