
హైదరాబాద్: ఆసియా గేమ్స్ ప్రిపరేషన్స్‌లోనే తనకు ఇబ్బందిగా ఉందని దాంతో తాను ఆసియా క్రీడలకు హాజరుకాలేనని కామన్వెల్ క్రీడల స్వర్ణ విజేత మీరాబాయి చాను భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్‌కు లేఖ రూపంలో రాసింది. ఈ మేరకు రాసిన లేఖలో తనకు రెస్ట్ ఇవ్వాలంటూ ఆమె రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం తాను ఫిట్‌గా లేనని ఆమె తన లేఖలో పేర్కొన్నది. వెన్ను నొప్పి వల్ల ఆసియా క్రీడలకు వెళ్లకూడదని నిర్ణయించకున్నట్లు లిఫ్టర్ చాను తెలిపింది. నేరుగా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి సిద్ధమవుతున్నట్లు చాను పేర్కొంది.
భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య సెక్రటరీ జనరల్ సహదేవ్ యాదవ్ మాట్లాడుతూ.. ఆసియా క్రీడలకు మీరాబాయి చాను హాజరుకాలేకపోతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం సహకరించడం లేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి అధికారిక మెయిల్ ద్వారా తెలియజేస్తాను అని వివరించాడు.
మీరాబాయి చాను మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణి. గురువారం ప్రారంభమైన కామన్వెల్త్ పోటీల్లో చాను అద్భుత ప్రదర్శన చేసింది. అంతేకాదు స్వర్ణ పతకం సాధించే క్రమంలో మూడు కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను బద్దలు కొట్టింది. స్నాచ్, పుల్లింగ్, లిప్ట్‌ల్లో చాను కామెన్‌వెల్త్ రికార్డును సృష్టించింది.
గతేడాది అమెరికాలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో చాను.. 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల భారత చీఫ్ కోచ్ విజయ్ శర్మ కూడా చానుపై అనుమానాలు వ్యక్తం చేశారు. జకర్తాలో జరిగే ఆసియా క్రీడలకు చాను దూరంగా ఉండడమే బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. గుర్తు తెలియని వెన్నునొప్పితో చాను బాధపడుతున్నట్లు చీఫ్ కోచ్ చెప్పారు.