Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా గేమ్స్: భారత్‌కు పతకాన్ని ఖాయం చేసిన వినేశ్ ఫోగాట్

Asian Games 2018: Vinesh Phogat enters 50 kg wrestling final; ensures silver medal

హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. రెజ్లింగ్‌లో మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వినేశ్ ఫోగాట్ ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో ఆమెకు పతకం ఖాయమైంది.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

సెమీ ఫైనల్‌ పోరులో వినేశ్‌ ఫోగట్‌ 10-0 తేడాతో యక్షిమురతోవా( ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. సోమవారం సాయంత్రం జరుగనున్న స్వర్ణ పత పోరులో జపాన్‌కు చెందిన ఇరి యుకితో ఫోగట్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఆసియా గేమ్స్‌లో వినేశ్ ఫోగాట్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో వినేశ్‌ ఫోగట్‌ 8-2 తేడాతో చైనా రెజ్లర్‌ యనన్‌ సున్‌పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు.

ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో ఫోగాట్ అద్భుత ప్రదర్శన చేసింది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన హుయుంగ్జో కిమ్‌పై సాంకేతికంగా 11-0తేడాతో నెగ్గింది. మరోవైపు సాక్షి మాలిక్‌, పింకీలకు నిరాశే ఎదురైంది. సాక్షి మాలిక్‌(62 కేజీల విభాగం) సెమీస్‌లో ఓడిపోగా, పింకీ(53కేజీలు) తొలి బౌట్‌లోనే నిష్క్రమించింది.

ఇక పూజ దండా( 57 కేజీలు) సెమీస్‌లో ఓడిపోయింది. దీంతో కాంస్య పతక పోరులో తలపడే మరో అవకాశం లభించింది. కాంస్య పతక పోరులో జపాన్‌ క్రీడాకారిణి సాకగామి కాట్సుకితో పూజా దండా తలపడనున్నారు.

ఇప్పటికే, రెజ్లింగ్‌ 65 కేజీల పురుషుల విభాగంలో జపాన్‌కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పూనియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో యోగేశ్వర్‌దత్‌ (2014), కర్తార్‌సింగ్‌ (1978, 86), సత్పాల్‌సింగ్‌ (1982), రాజిందర్‌సింగ్‌ (1978), చంగ్డిసింగ్‌ (1970) తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడిగా భజరంగ్‌ నిలిచాడు. అంతేకాకదు ఒకే ఏడాది కామన్వెల్త్‌, ఆసియా క్రీడల స్వర్ణాలు గెలిచిన భారత మూడో రెజ్లర్‌ భజరంగ్‌.

Story first published: Monday, August 20, 2018, 17:10 [IST]
Other articles published on Aug 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+