పంటి బిగువన క్యాన్సర్ బాధను నొక్కిపెట్టి.. స్వర్ణాన్ని కొట్టేసిన తేజిందర్ ఎవరంటే..?

జకార్తా: ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో తొలిరోజే భారత్ స్వర్ణంతో మెరిసింది.. షాట్‌పుట్‌లో తేజిందర్‌పాల్ సింగ్ తూర్ ఆసియా రికార్డు బద్దలుగొట్టి అగ్రస్థానం సాధించాడు. స్క్వాష్ సింగిల్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు సెమీఫైనల్లో పరాజయాలు చవిచూడడంతో కాంస్య పతకాలే లభించాయి. ఆసియాడ్‌లో ఈసారి అరంగేట్రం చేసిన బ్రిడ్జ్‌లో రెండు పతకాలు ఖరారయ్యాయి. శనివారం పోటీలు ముగిసే సరికి భారత్ (7 స్వర్ణాలు, 5 రజతాలు, 17 కాంస్యాలు) 29 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
23 ఏళ్ల తేజిందర్‌పాల్ సింగ్ తుర్‌ది పంజాబ్‌లోని మోగా జిల్లాలోని ఖోసా పాండో గ్రామం. అతనిది రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి తేజిందర్‌కు క్రికెటర్ కావాలన్నదే కోరిక. కానీ నాన్న కరమ్‌సింగ్ ప్రోత్సాహంతో షాట్‌పుట్‌ను ఎంచుకున్నాడు. ధర్మశాలలో అతని శిక్షణ నడిచేది. ఎంఎస్ థిల్లాన్ కోచింగ్‌లో రాటుదేలిన తేజిందర్.. వేగంగా జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. 2015 భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్ కప్‌లో రజతం గెలవడంతో తొలిసారి అతని పేరు తెర మీదకు వచ్చింది. భారత నావికా దళంలోనూ ఉద్యోగం వచ్చింది.

2018 కామన్వెల్త్ క్రీడల్లో నిరాశ గురైన తేజిందర్:
తుర్కెమెనిస్థాన్‌లో జరిగిన ఆసియా ఇండోర్ ఛాంపియన్‌షిప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి ఆకట్టుకున్నాడు. కానీ 2018 కామన్వెల్త్ క్రీడల్లో తేజిందర్ బాగా నిరాశ పరిచాడు. చెత్త ప్రదర్శనతో ఎనిమిదో స్థానంలో నిలవడం అతనిలో కసి పెంచింది. జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి ఫామ్‌లోకి వచ్చిన ఈ కుర్రాడు.... ఆ తర్వాత ఆసియా నంబర్‌వన్ షాట్‌పుటర్‌గా నిలిచాడు. అతనీ స్థితిలో ఉండటానికి కారకుడైన నాన్న కరన్‌సింగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం పంజాబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

21 మీటర్ల దూరం.. ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నా:
గుండును 21 మీటర్ల దూరం విసరడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నా. గత కొన్నేళ్లుగా జాతీయ రికార్డు బద్దలు కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించా. మా నాన్న చేసిన ఎన్నో త్యాగాల ఫలితం ఈ ఆసియా క్రీడల స్వర్ణం. నా లక్ష్యం కోసం కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. కోచ్ థిల్లాన్ కృషి ఎంతో ఉంది. ఇప్పుడు వెంటనే వెళ్లి నాన్నను చూడాలని ఉంది

పాల్.. బాధను పంటిబిగువన అదిమిపట్టి కెరీర్:
తేజిందర్ పాల్‌సింగ్ తూర్‌ది పంజాబ్‌లోని మోగా జిల్లా ఖోసాపాండో గ్రామం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తేజిందర్ దేశంలోని అందరు యువకుల మాదిరే తొలుత క్రికెట్‌పట్ల క్రేజ్ పెంచుకున్నాడు. కానీ తండ్రి కరమ్ సింగ్ సలహాతో అతడు అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్‌ను ఎంచుకున్నాడు. అయితే తండ్రి కరమ్ సింగ్ రెండేళ్ల కిందట క్యాన్సర్ బారిన పడడం తజిందర్‌ను కలిచి వేసింది. కానీ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా తనను చూడాలన్న తండ్రి కలను సాకారం చేసేందుకు పాల్.. ఆ బాధను పంటిబిగువన అదిమిపట్టి కెరీర్ కొనసాగించాడు.

ఏకాగ్రత దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆసుపత్రికి రానివ్వలేదు:
తండ్రి వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే అతడి ఏకాగ్రత దెబ్బతింటుందనే ఉద్దేశంతో తూర్‌ను ఆ ఛాయలకే రానివ్వలేదు అతడి కుటుంబం. ఆసుపత్రి వ్యవహారాలన్నీ తజిందర్ మిత్రులు చూసుకున్నారు. ధర్మశాలలో శిక్షణ పొందుతున్న అతడు తండ్రి చికిత్స సమయంలో ఎక్కువగా ఇంటికి కూడా వెళ్లలేదు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల మధ్య సాధించిన ఆసియాడ్ స్వర్ణం తజిందర్‌కు ఎంతో మురిపమైంది. తనకోసం కుటుంబం ఎంతో త్యాగం చేసిందని ఉద్వేగంగా చెప్పాడు. ఈ పతకాన్ని తన గొప్ప విజయంగా అభివర్ణించాడు. తక్షణమే తండ్రిని చూడాలని పాల్ ఆరాటపడుతున్నాడు. అయితే రెండురోజులు మాత్రమే అతడు తండ్రితో గడపనున్నాడు. ఆపై మళ్లీ ధర్మశాల వెళ్లి సాధనలో నిమగ్నం కానున్నాడు. తన ఈ విజయంలో కోచ్ థిల్లాన్ పాత్ర ఎనలేనిదని తజిందర్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications