For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్‌: పతకాలు సాధించేది వీరే, అభిమానుల ఆశలు

By Nageshwara Rao
Asian Games 2018: Top medal hopefuls for India

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో 18వ ఆసియా క్రీడల సంరంభానికి తెరలేవనుంది. ఇండోనేషియా ఆతిథ్యమిస్తోన్న ఈ ఆసియా క్రీడలు శనివారం (ఆగస్టు 18)న రాజధాని జకార్తాలోని GBK ప్రధాన స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రీడా సంరంభానికి హాజరవుతోన్న 11వేల మంది అథ్లెట్లు, 5వేల మంది అధికారులకు జకర్తా, పాలెంబాగ్‌లు ఆతిథ్యమివ్వనున్నాయి.

ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెట్లపై అభిమానులు గంపెడాశలు పెట్టుకుంటున్నారు. రెజ్లింగ్, బాడ్మింటన్, షూటింగ్, అథ్లెటిక్స్, టెన్నిస్, బాక్సింగ్, జిమ్నాస్టిక్, టేబుల్ టెన్నిస్ తదితర అంశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గత ఒలింపిక్స్ పోటీల కంటే ఎక్కువగా పతకాలు సాధిస్తారనే గట్టి నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

 బజరంగ్ పూనియా

బజరంగ్ పూనియా

ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌ విభాగంలో పోటీపడే హర్యానాకు చెందిన 24 ఏళ్ల బజరంగ్ పూనియా ఈ ఏడాది పాల్గొన్న మూడు టోర్నమెంట్లలో విజయం సాధించాడు. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను సాధించాడు. ఆ తర్వాత జార్జియా, ఇస్తాంబుల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో సైతం టైటిల్స్ సాధించాడు. ఇక, మరో రెజ్లర్ సుశీల్ కుమార్ ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు. నాలుగేళ్ల తర్వాత ఇటీవల జార్జియాలో జరిగిన ఒక పోటీలో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో తప్పనిసరిగా భారత్‌కు పతకం అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. దీంట్లోనే మహిళల విభాగంలో పోటీ పడే మరో రెజ్లర్ వినేష్ ఫొగట్. రియో ఒలింపిక్స్ సందర్భంగా కాలి వేలికి తగిలిన దెబ్బతో సతమతమైంది. కామన్‌వెల్త్ గేమ్సలో గోల్డ్ మెడల్‌తోపాటు మాడ్రిడ్‌లోని స్పెయిన్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్‌లో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇపుడు జకార్తాలో జరిగే ఆసియా గేమ్స్‌లో ఆమె 50 కేజీల విభాగంలో తప్పనిసరిగా మెడల్ సాధింస్తుందని అంటున్నారు.

పీవి సింధు

పీవి సింధు

బాడ్మింటన్ మహిళల విభాగంలో పోటీపడుతున్న పీవీ సింధు ఇటీవలే నాన్‌జింగ్‌లో జరిగిన ఫైనల్‌లో కరొలినా మారిన్ చేతిలో పరాజయంపాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆమె ఇంతవరకు ఆడిన నాలుగు ప్రధాన ఈవెంట్లలో ఫైనల్‌లో తృటిలో ఓటమిని చవిచూస్తోంది. ఆసియా గేమ్స్‌పై చక్కని ఆటతీరును కనబరుస్తుందని క్రీడాభిమానులు విశ్వసిస్తున్నారు. బాడ్మింటన్ పురుషుల విభాగంలో కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజత పతకం అందుకున్న కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది ఏప్రిల్‌లో పురుషుల సింగిల్స్‌లో తొలి ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఆసియా గేమ్సలో చైనా, ఇండొనేషియా, జపాన్ షట్లర్‌తో పోటీ పడనున్నాడు.

మనూ బాకర్

మనూ బాకర్

షూటింగ్ విభాగంలో పోటీపడుతున్న హర్యానాకు చెందిన మనూ బాకర్ 16 ఏళ్ల ప్రాయంలో ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో తన అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో సైతం గోల్డ్ మెడల్ అందుకున్న మనూ బాకర్ ఆసియా గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.

హిమ దాస్

హిమ దాస్

అథ్లెటిక్స్ అంశంలో మహిళల విభాగంలో పోటీపడుతున్న అసోంలోని మారుమూల గ్రామానికి చెందిన 20 ఏళ్ల హిమ దాస్ గోల్డ్ కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆరోస్థానాన్ని ఆక్రమించింది. ఐఏఏఎఫ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగు పందెం పోటీలో 51.59 నిమిషాల్లో చేరుకుని గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా ఘనత సాధించింది. ఇపుడు జకార్తా ఆసియా క్రీడల్లో మరో పతకం సాధిస్తాననే గట్టి నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేస్తోంది.

నీరజ్ చోప్రా

నీరజ్ చోప్రా

జావెలిన్ త్రో అంశంలో పోటీపడే నీరజ్ చోప్రా 2016లో జరిగిన అండర్-20 పోటీల్లో పాల్గొని ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో 86.47 మీటర్ల వరకు విసిరి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. దోహాలో ఇటీవల జరిగిన ఐఏఏఎఫ్ డైమండ్ లీగ్‌లో పాల్గొని 87.43 మీటర్లతో తన వ్యక్తిగత రికార్డును తానే అధిగమించాడు. ఇటీవల కాలంలో ప్రాతినిధ్యం వహించిన నాలుగు ప్రధాన ఈవెంట్లలో మూడు గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నాడు. ఆసియా క్రీడల్లో తప్పనిసరిగా భారత్‌కు మరో గోల్డ్ మెడల్ అందించే అవకాశం లేకపోలేదని అభిమానులు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సీమా పూనియా

సీమా పూనియా

మహిళల డిస్కస్ త్రోలో పోటీపడుతున్న 35 ఏళ్ల సీమా పూనియా సైతం భారత్‌కు తప్పనిసరిగా మెడల్ అందించే అవకాశం ఉంది. అయితే, ఆమె ఆసియా గేమ్స్‌లో చైనాకు చెందిన బలమైన ప్రత్యర్థితో తలపడాల్సి ఉంటుంది. పరుగు పందెం అంశంలో పోటీపడుతున్న ఒడిశాకు చెందిన 22 ఏళ్ల దుతీ చంద్ సీఏఎస్ ఈవెంట్‌లో అద్భుతంగా రాణించింది. సెమీఫైనల్స్‌లో తాను గతంలో నెలకొల్పిన జాతీయ రికార్డును అధిగమించి స్వర్ణ పతకం సాధించింది.

రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ జోడీ

రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ జోడీ

టెన్నిస్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగుతున్న బెంగళూరుకు చెందిన రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ జోడీపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. టెన్నిస్ సింగిల్స్‌లో యుకీ బాంబ్రి ప్రాతినిధ్యం వహించలేని పక్షంలో చెన్నై ఆడగాడు రామ్‌కుమార్ రామ్‌నాథన్ బరిలోకి దిగే అవకాశం ఉండడంతో భారత ఆశలు నిలబెడతాడని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.

వికాస్ కృష్ణన్

వికాస్ కృష్ణన్

బాక్సింగ్‌లో పోటీపడుతున్న వికాస్ కృష్ణన్ రెండుసార్లు ఆసియా గేమ్స్‌లో పాల్గొని పతకాలు అందుకున్నాడు. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో 75 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్‌ సాధించాడు. జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ తరఫున పతకం సాధించే అథ్లెట్లలో వికాస్ ఒకడు. బాక్సింగ్స్‌లో పోటీపడుతున్న గౌహతికి చెందిన శివథాప కూడా ఆసియా గేమ్స్‌లో తప్పనిసరిగా మెడల్ సాధించే అవకాశం ఉంది.

దీపా కర్మాకర్

దీపా కర్మాకర్

జిమ్నాస్టిక్స్‌లో పోటీపడుతున్న దీపా కర్మాకర్ టర్కీలోని మెర్సిన్‌లో జరిగిన వరల్డ్ చాలెంజ్ కప్‌లో స్వర్ణ పతకం సాధించింది. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న దీపా కర్మార్కర్ ఆసియా గేమ్స్‌లో తప్పనిసరిగా భారత్‌కు పతకాన్ని అందించే అవకాశం ఉంది.

 మనీకా బాత్రా

మనీకా బాత్రా

టేబుల్ టెన్నిస్‌లో బరిలోకి దిగుతున్న మనీకా బాత్రా గోల్డ్ కోల్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబరచి గోల్డ్ మెడల్ అందుకుంది.

Story first published: Friday, August 17, 2018, 15:29 [IST]
Other articles published on Aug 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+