Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆసియా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల ఖర్చులు మేమే భరిస్తాం'

Asian Games 2018: Sports Ministry will bear kits expenses for minor sports

హైదరాబాద్: 'ఆసియా క్రీడల్లో పాల్గొనే ఏ జట్టూ కిట్‌, ట్రాక్‌ల ఖర్చు భరించాల్సిన అవసరం లేదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి జట్టుకు కిట్‌లు, దుస్తులు అందజేయాలని స్పోర్ట్స్‌ ఇండియా (ఎస్‌ఏ)ను ఆదేశించా'నని రాఠోడ్‌ తెలిపారు. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)తో అనుబంధం లేని క్రీడా సమాఖ్యలు కిట్‌లు, దుస్తులు సొంతంగా సమకూర్చుకోవాలని ఐఓఏ కార్యదర్శి రాజీవ్‌ మెహతా పేర్కొన్న నేపథ్యంలో మంగళవారం క్రీడల మంత్రి స్పందించారు.

కిట్లు, యూనిఫామ్‌లకయ్యే ఖర్చును తాము భరిస్తామంటూ కేంద్ర క్రీడాశాఖ మాటిచ్చింది. ఆసియా క్రీడల్లో పాల్గొనే ఏ ఒక్క జట్టు కూడా కిట్, అధికారిక జెర్సీల కోసమయ్యే ఖర్చులను సొంతంగా భరించనవసరం లేదు. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్క జట్టుకు అవసరమయ్యే కిట్లు, డ్రెస్స్‌లను ఇవ్వాలంటూ సాయ్‌ను ఆదేశిస్తున్నాను అని కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

అంతకుముందు ఐవోఏ సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా మాట్లాడుతూ ఐవోఏ అనుబంధ క్రీడా సంఘాలకు మాత్రమే కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. గుర్తింపు ఉన్నా, లేకున్నా క్రీడాకారుల కిట్లు, జెర్సీలకయ్యే ఖర్చును క్రీడాశాఖ గతంలోనూ నిధులు వెచ్చించింది అని మెహతా పేర్కొన్నారు.

2018 ఆసియా క్రీడల్లో భారత్ తరపున 37 క్రీడా విభాగాల్లో క్రీడాకారులు పాల్గొంటున్నారు. కొన్ని విభాగాలు మాత్రం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు చెందనవి ఉన్నాయి. అవి బ్రిడ్జ్, కురాష్, పెంకాక్ సిలాట్, రోలర్ స్కేటింగ్, సాంబో, సెపాక్‌టక్రా, సాఫ్ట్ టెన్నిస్, స్పోర్ట్ క్లైంబింగ్ విభాగాల ద్వారా 114 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా మిగిలిన 524 మంది అథ్లెట్ల పేర్లనె ఒలింపిక్ సంఘం తమ ఆధ్వర్యంలో పాల్గొంటున్నట్లు వెల్లడించింది.

Story first published: Wednesday, August 1, 2018, 10:56 [IST]
Other articles published on Aug 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+