పెద్ద మనసు చూటుకున్న సీమా: ద్యుతీ, స్వప్నకు భారీ నజరానా

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో మహిళల డిస్కస్ త్రో ఈవెంట్‌లో కాంస్యం పతకం నెగ్గిన సీమా పూనియా పెద్ద మనసు చాటుకుంది. ఆసియా గేమ్స్‌లో రోజువారీ భత్యం కింద తనకు లభించిన 700 అమెరికన్ డాలర్ల (రూ.50 వేలు)కు మరో లక్ష రూపాయలు కలిపి కేరళ వరద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్లు సీమా పూనియా ప్రకటించింది.
వరదలతో సర్వం కోల్పోయిన కేరళకు సాయం చేయాలని ఇతర అథ్లెట్లను కూడా ఆమె ఈ సందర్భంగా కోరింది. స్వయంగా కేరళ వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొంటానని హర్యానాకు చెందిన సీమా పూనియా తెలిపింది. కేరళ నుంచి తిరిగి వచ్చాక తన ఎడమ పాదంలో దెబ్బతిన్న ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు తెలిపింది.

కాంస్యంతో వెనుదిరిగిన సీమా పూనియా
కాగా, ఆసియా గేమ్స్‌లో సీమా పూనియా ఈసారి కాంస్యంతో వెనుదిరిగింది. గురువారం జరిగిన పోటీలో 35 ఏళ్ల సీమా డిస్క్‌ను 62.26 మీటర్లు మాత్రమే విసరగలిగింది. ఆసియా చాంపియన్, చైనా అథ్లెట్ చెన్ యాంగ్ (65.12 మీ.) స్వర్ణం నెగ్గింది. ఆ దేశానికే చెందిన ఫెంగ్ బిన్ (64.25 మీ.)కు రజతం దక్కింది.

గత ఆరేళ్లలో సీమాకు ఇదే అత్యుత్తమ రికార్డు
2014లో ఇంచియాన్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన గణాంకాలను (61.03 మీ.) సీమా సవరించినా ప్రత్యర్థులు ఇంకా మెరుగ్గా రాణించడంతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఆరేళ్లలో ఆమెకిదే అత్యుత్తమ రికార్డు కావడం గమనార్హం. మరో భారత త్రోయర్ సందీప్ కుమారి (54.61 మీ.) ఐదో స్థానంలో నిలిచింది.

తన వైఫల్యానికి కారణం అది కాదు
గురువారం డిస్కస్ త్రో పోటీల సందర్భంగానూ గాయం ఇబ్బంది పెట్టిందని, అయితే తన వైఫల్యానికి అది కారణం కాదని పూనియా అనంతరం పేర్కొంది. ఇదే సందర్భంగా తనకు అర్జున అవార్డు రాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీమా పూనియా హర్యానా పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తోంది.

అథ్లెటిక్స్‌లో రాణించిన ద్యుతీ, స్వప్నలకు భారీ నజరానా
మహిళల 100 మీ, 200 మీ పరుగులో రజతాలు నెగ్గిన ద్యుతీ చంద్‌కు రూ.కోటిన్నర నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన స్వప్నా బర్మన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.10 లక్షల నజరానా ప్రకటించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications