Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నన్ను టీవీలో చూపిస్తుంటే భలే సరదాగా ఉంది: రోయర్ భగ్‌వాన్‌ సింగ్‌

Asian Games 2018: Rowing provided me what I could not achieve in education, says Bhagwan Singh

హైదరాబాద్: చదువులో సాధించలేకపోయింది... రోయింగ్‌లో సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని భారత రోయర్‌ భగ్‌వాన్‌ సింగ్‌ వెల్లడించాడు. ఇండోనేషియాలోని జకర్తా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో భగ్‌వాన్‌ శుక్రవారం తన సహచర ఆటగాడు రోహిత్‌తో కలిసి లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌లో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.

పతకం సాధించిన అనంతరం భగ్‌వాన్‌ సింగ్ మాట్లాడుతూ "ఏడేళ్ల క్రితం ఎంతో ఆసక్తితో జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ కోర్సు చేద్దామని చండీగఢ్‌‌‌ యూనివర్సిటీలో చేరాను. కానీ, కుదరలేదు. చదువులో సాధించలేకపోయింది... ఇప్పుడు రోయింగ్‌లో సాధించాను. చాలా ఆనందంగా ఉంది" అని అన్నాడు.

మా నాన్న ఓ ట్రక్కు డ్రైవర్‌

మా నాన్న ఓ ట్రక్కు డ్రైవర్‌

"చదువు కోసం నా సొంతగ్రామం తాట్టిభాయి నుంచి మోగాకు మారాం. మా నాన్న ఓ ట్రక్కు డ్రైవర్‌. తాగుడుకు బానిస. డయాబెటిస్‌ తగ్గేందుకు వాడిన మందుల కారణంగా ఒక ఊపిరితిత్తి దెబ్బతింది. అప్పటి నుంచి కుటుంబాన్ని పోషించడం కోసం ఆర్మీలో చేరాను" అని భగ్‌వాన్ సింగ్ చెప్పాడు.

 భలే సరదాగా ఉంది

భలే సరదాగా ఉంది

"దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం గెలవడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. మీడియాలో చేరి పలు ఈవెంట్స్‌ను కవర్‌ చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. కానీ, ఈ రోజు మీడియా వారు వచ్చి నన్ను టీవీలో చూపిస్తున్నారు. భలే సరదాగా ఉంది" అని భగ్‌వాన్‌ సంతోషంతో చెప్పాడు.

నాకు రోయింగ్‌ను పరిచయం చేసింది ఆయనే

నాకు రోయింగ్‌ను పరిచయం చేసింది ఆయనే

"నిజానికి బాంబే ఇంజినీర్స్‌ గ్రూప్‌కు చెందిన సుబేదార్‌ కుద్రత్‌ అలీ నాకు రోయింగ్‌ను పరిచయం చేశారు. ఇంగ్లాండ్‌ రోయర్‌, ఐదుసార్లు ఒలింపిక్‌ పతక విజేత స్టీవ్‌ రెడ్‌గ్రేవ్‌ నా అభిమాన రోయర్" అని భగ్‌వాన్‌ చెప్పుకొచ్చాడు. గతేడాది పూణె నేషనల్స్‌లో కూడా భగ్‌వాన్ రెండు స్వర్ణ పతకాలను సాధించాడు.

భగ్‌వాన్ ఎన్నో త్యాగాలు చేశాడు

భగ్‌వాన్ ఎన్నో త్యాగాలు చేశాడు

భగ్‌వాన్ కాంస్యం గెలిచిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా భగవాన్ తండ్రి దర్శన్‌ సింగ్‌ మాట్లాడుతూ "కుటుంబం కోసం భగ్‌వాన్ ఎన్నో త్యాగాలను చేశాడు. 2012లో కుటుంబ పోషణ కోసం భగ్‌వాన్‌ చదువు వదిలేశాడు. ఇన్నేళ్ల తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. చాలా సంతోషంగా ఉంది" అని అన్నాడు.

Story first published: Saturday, August 25, 2018, 14:14 [IST]
Other articles published on Aug 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+