
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన మహిళల వుషు సందా 60 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన రోషిబినా దేవి కాంస్య పతకం సొంతం చేసుకుంది.
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చైనాకు చెందిన కాయ్ ఇంగ్‌ఇంగ్‌పై రోషిబినా దేవి అద్భుత విజయాన్ని నమోదు చేసి కాంస్య పతకాన్ని సాధించింది.
మొత్తంగా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది 12వ పతకం కావడం విశేషం. అయితే, వుషు విభాగంలో భారత్‌కు ఇది నాలుగో పతకం కావడం విశేషం. ఒక్క బుధవారమే వుషు విభాగంలో భారత క్రీడాకారులు నాలుగు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.