
జకార్తా: ఆసియా క్రీడా సంరంభంలో మరో రజతం సొంతం చేసుకున్నారు నీనా వారకిల్. మహిళల లాంగ్ జంప్ విభాగంలో 6.51మీటర్ల దూరాన్ని నాలుగో అటెంప్ట్‌లో సునాయాసంగా దూకి రెండో స్థానంలో నిలిచింది. వియత్నాంకు చెందిన తీ తు తావో బుయ్ 6.55మీటర్ల దూరం వరకూ దూకి స్వర్ణాన్ని దక్కించుకున్నారు. కాంస్యాన్ని చైనాకు చెందిన గ్సియోలిలంగ్ గ్సూ 6.50మీటర్ల దూరంలో సొంతం చేసుకున్నారు.
దీంతో భారత్‌కు 41 పతకాలు సొంతమైయ్యాయి. ఇందులో స్వర్ణం 8, రజతం 13, కాంస్యం 20 ఉన్నాయి.