Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోయింగ్‌లో 1 స్వర్ణం, 2 కాంస్యాలు సాధించిన భారత్, నేటి భారత్ షెడ్యూల్

Asian Games 2018 Live Day 6: India win one gold, two bronze medals in rowing

హైదరాబాద్: భారత్‌ రోవర్లు సత్తా చాటారు. ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు సాధించి పెట్టారు. రోయింగ్‌ క్వాడ్రుపుల్‌ పురుషుల స్కల్స్‌లో భారత రోవర్లు ‌అద్భుత ప్రదర్శన కనబరిచారు. సవర్ణ్‌ సింగ్‌, దత్తు భోకనల్‌, ఓమ్‌ ప్రకాశ్‌, సుఖ్‌మిత్‌సింగ్‌ జట్టు తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

పురుషుల లైట్‌వెయిట్ సింగిల్స్ స్కల్స్ రోయింగ్ ఈవెంట్‌లో.. దుష్యంత్‌కు కాంస్య పతకం దక్కింది. వాస్తవానికి ఈ ఈవెంట్‌లో భారత్ మరిన్ని పతకాలను మిస్సయ్యింది. గేమ్స్ జరిగిన అయిదవ రోజు.. భారత రోవర్లు ఆ ఛాన్సు వదులుకున్నారు. ఆరవ రోజు దుష్యంత్.. క్వాడ్రేనియల్ ఈవెంట్‌లో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో భారత మెడల్స్ సంఖ్య 19కి చేరింది. నాలుగేళ్ల క్రితం ఇంచియాన్‌లో జరిగిన క్రీడల్లోనూ.. దుష్యంత్ ఇదే ఈవెంట్‌లో మెడల్ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లకు.. ఇదే రోయింగ్ క్రీడల్లో మరోసారి బ్రాంజ్ మెడల్‌ను స్వాధీనం చేసుకున్నాడు.

తన టైమింగ్‌ను కూడా అతను ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఏడు నిమిషాల 18 సెకన్లలో ఈ వెంట్‌ను పూర్తి చేశాడతను. 1500మీటర్ల మార్క్ దగ్గర.. రెండవ స్థానంలో ఉన్న అతను.. ఆ తర్వాత నెమ్మదిగా వేగాన్ని కోల్పోయాడు. దీంతో అతను మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దుష్యంత్ తర్వాత.. రోవింగ్ ఈవెంట్‌లోనే మరో ఇద్దరు భారత క్రీడాకారులు తమ సత్తా చాటారు. లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్‌లో.. రోహిత్ కుమార్, భగవాన్ సింగ్ జంట కాంస్య పతకాన్ని గెలుచుకున్నది. దీంతో ఇవాళ భారత్‌కు రోయింగ్‌లోనే రెండు పతకాలు వచ్చాయి.

జిమ్నాస్టిక్స్‌: మహిళల బ్యాలెన్స్‌ బీమ్‌ ఫైనల్‌: దీపా కర్మాకర్‌ (మ.గం. 3 నుంచి)

కబడ్డీ: మహిళల ఫైనల్‌: భారత్‌ వర్సెస్‌ ఇరాన్‌; (మ.గం.1.30 నుంచి)

షూటింగ్‌: ఉ.గం.7.30 నుంచి) పురుషుల 300 మీ. స్టాండర్డ్‌ రైఫిల్‌: అమిత్, హర్జీందర్‌ సింగ్‌

పురుషుల 25 మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌: శివమ్‌ శుక్లా, అనీష్‌; మహిళల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ : మను భాకర్, హీనా సిద్ధూ

టెన్నిస్‌: పురుషుల డబుల్స్‌ ఫైనల్‌: బోపన్న, దివిజ్‌ శరణ్‌గీబబ్లిక్‌/డెనిస్‌ (కజకిస్తాన్‌); సింగిల్స్‌ సెమీస్‌: ప్రజ్నేశ్‌ వర్సెస్‌ డెనిస్‌ ఇస్తోమిన్‌

వెయిట్‌లిఫ్టింగ్‌: మహిళల 63 కేజీలు: రాఖీ హల్దార్‌ (మధ్నాహ్నం గం.12.30 నుంచి)

బ్యాడ్మింటన్‌: పురుషుల సింగిల్స్‌: శ్రీకాంత్‌ వర్సెస్‌ విన్సెంట్‌ (హాంకాంగ్‌); ప్రణయ్‌ వర్సెస్‌ వాంగ్‌చరొయెన్‌ (థాయ్‌లాండ్‌) (మ.12 గం.నుంచి).

Story first published: Friday, August 24, 2018, 12:09 [IST]
Other articles published on Aug 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+