For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామన్వెల్త్ గేమ్స్‌లా ఆసియా గేమ్స్‌లోనూ హర్యానానే టాప్..!!

Asian Games 2018: Like CWG 2018, Haryana leads medal tally

హైదరాబాద్: ఖండాంతర స్థాయిలో జరిగిన ఈవెంట్‌ ఆసియా గేమ్స్‌లో భారత్ ఎప్పుడూ లేనంతగా 69 పతకాలను సాధించింది. ఇందులో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు ఉన్నాయి. 2018 ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత్ 2010 గాంగ్ జౌ క్రీడలలో సాధించిన స్వర్ణాల రికార్డులో సమాన స్థాయికి చేరింది. అంతేకాదు దాంతో పాటు 1951 ఆసియాన్ గేమ్స్‌లో సాధించిన స్వర్ణాల సంఖ్యతో సమానంగా నిలిచింది.

అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరపున పాల్గొన్న క్రీడాకారులలో అగ్రస్థానంలో నిలిచిన హర్యానా.. ఆసియా గేమ్స్‌లోనూ అదే స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇంకా కామెన్వెల్త్ గేమ్స్ కంటే ఆసియా గేమ్స్‌లో 6 రాష్ట్రాలు అదనంగా పాల్గొన్నాయి. భారత దేశ పటంలో చూపించినట్లు ఇందులో 15 స్వర్ణం, 24 రజతం, 30 కాంస్యాలు రాష్ట్రాల వారీగా కనిపిస్తున్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లోలా హర్యానా అధిక సంఖ్యలో పతకాలు దక్కించుకున్నాయి.

ఇందులో బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో 5 పతకాలును సాధించింది హర్యానా. ఇలా మొత్తానికి కామన్వెల్త్ గేమ్స్‌లో దాదాపు 30 వరకూ పతకాలు హర్యానాకు దక్కాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో 66 పతకాలు సాధించిన భారత్‌లో కేవలం హర్యానా క్రీడాకారులు మాత్రమే 22 సాధించారు. మధ్య ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖాండ్‌లు మాత్రం పతకాలు సాధించడంలో వెనుకబడ్డాయి.

కానీ, ఆసియా గేమ్స్‌లో మాత్రం జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఒక కాంస్యం, మధ్య ప్రదేశ్ ఒక రజతం, రెండు కాంస్యాలు, ఒడిశా మూడు రజతాలు, ఒక కాంస్యం, జార్ఖండ్ రెండు రజతాలు దక్కించుకోగా చత్తీస్ ఘడ్.. ఉత్తరాఖాండ్ మాత్రం మరోసారి వట్టి చేతుల్తో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.

Story first published: Monday, September 3, 2018, 17:14 [IST]
Other articles published on Sep 3, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+